Mobile : మొబైల్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్.. రీచార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గే ఛాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mobile : మొబైల్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్.. రీచార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గే ఛాన్స్

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Mobile : మొబైల్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్..రీచార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గే ఛాన్స్

Mobile : కొద్ది రోజుల క్రితం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా నెట్వర్క్ ల టారిఫ్ ప్లాన్ ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో వినియోగ‌దారులు ల‌బోదిబోమ‌న్నారు.2024 బడ్జెట్ లో మొబైల్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతాయని సంతోషించే లోపే రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరగ‌డం కలవరపాటుకు గురి చేస్తుంది. 5జీ విస్తరణ కోసమే ధరలను పెంచామని టెలికాం కంపెనీలు చెప్పాయి. దీంతో వినియోగదారులు 15 నుంచి 25 శాతం అదనంగా రీఛార్జ్ ధరలు చెల్లిస్తున్నారు. అయితే మొబైల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుంది.టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు అందించే మొబైల్‌ రీఛార్జి ప్లాన్‌లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Mobile భారీగా త‌గ్గ‌నున్న రీచార్జ్ ధ‌ర‌లు..

ప్రస్తుతం టెలికాం కంపెనీలు.. వాయిస్, డేటా, ఎస్‌ఎంఎస్‌లను సౌకర్యాలన్నింటిని.. ప్ర‌త్యేక ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నాయి. దీంతో చాలా మంది వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే వినియోగించుకుని డేటా వాడట్లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు, నార్మల్‌ ఫోన్‌ వాడే వారి విషయంలో నెట్ వాడే వారు చాలా త‌క్కువ‌. దాంతో చాలా మంది కస్టమర్లు.. ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఈక్ర‌మంలో డేటా, ఎస్‌ఎంఎస్‌, వాయిస్‌ కాలింగ్‌ కోసం ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చేందుకు ట్రాయ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Mobile మొబైల్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్ రీచార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గే ఛాన్స్

Mobile : మొబైల్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్.. రీచార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గే ఛాన్స్

ఇదే జరిగితే.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు తగ్గనున్నాయి అని సమాచారం. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు అందించే మొబైల్‌ రీఛార్జి ప్లాన్‌లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాయిస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌లను తీసుకురావాలని భావిస్తోంది ట్రాయ్‌. దీనిపై వినియోగదారులు అభిప్రాయాలను కోరింది. ఆగస్టు నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని ట్రాయ్‌ చెప్పుకొచ్చింది. ‘కన్సల్టేషన్‌ ఆన్‌ రివ్యూ ఆఫ్‌ టెలికాం కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్స్‌ (టీసీపీఆర్‌) -2012 ఓ సంప్రదింపులు పత్రాన్ని విడుదల చేయ‌గా, ఈ కన్సల్టేషన్‌ పేపర్‌పై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలను చెప్పాలని, 23కల్లా అభ్యంతరాలుంటే తెలియజేయాలంటూ ట్రాయ్‌.. టెలికం సంస్థలకు గడువు ఇచ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది