WhatsApp : వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఆ విషయంలో గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే ఫుల్ పవర్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WhatsApp : వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఆ విషయంలో గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే ఫుల్ పవర్!

 Authored By mallesh | The Telugu News | Updated on :3 September 2022,9:00 pm

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఏదైనా ఉందంటే అది వాట్సాప్ మాత్రమే. దాని తర్వాత ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటివి ఉంటాయి. అయితే, వాట్సాప్‌ను వరల్డ్ వైడ్‌గా యూజర్లు ఉండటంతో వారి ప్రయోజనాల కోసం కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇవి వారి వ్యక్తిగత భద్రత.. ప్రయోజనాలకు మేలు చేస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల కోసం సరికొత్త అప్డేట్‌ను తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

WhatsApp : ఇలా చేసే అధికారం అడ్మిన్లకు మాత్రమే..

ఒకప్పుడు కేవలం మెసేంజర్ లాగా ఉపయోగిన వాట్సాప్ ఇప్పుడు వార్తా ప్రసార సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. వాట్సాప్ ద్వారాచాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారని అందరికీ తెలిసిందే.దీని ద్వారా న్యూస్ క్షణాల్లో స్ప్రెడ్ అవుతోంది. అయితే, అందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు, యువత తప్పుడు సమాచారాన్నిషేర్ చేస్తుండటంతో అది శాంతిభద్రతలకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలోనే సవరించిన కేంద్ర ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ దేశీయంగా పలుమార్పులు చేసింది. గ్రూపు అడ్మిన్లకు కొన్ని ప్రత్యేక పవర్స్‌ను అందించింది.దీని ద్వారా ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ భావిస్తోంది. ప్రతీ రోజూ గ్రూప్స్‌లో ఏదో ఒక తప్పుడు వార్తకు సంబంధించిన మెసేజ్‌లు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

whatsapp group admins can delete every group member messages

whatsapp group admins can delete every group member messages

ఈ కొత్త ఫీచర్‌ సాయంతో వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లు గ్రూప్‌లో ఇతరులు పోస్ట్‌ చేసే మెసేజ్‌లను డిలీట్‌ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గ్రూప్స్‌లో సర్క్యూలేట్ అయ్యే మెసేజ్‌ తప్పుడు సమాచారం అని అడ్మిన్‌ భావిస్తే దానిని ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేయొచ్చు. దానిని సెలక్ట్ చేసి ‘డిలీట్‌ ఫర్‌ ఆల్‌’ నొక్కితే చాలు ఆ మెసేజ్‌ ఎవరికీ కనిపించకుండా డిలీట్‌ అవుతుంది. వాట్సాప్‌ గ్రూప్స్‌లో ఫేక్‌న్యూస్‌ వైరల్‌ అయితే దానికి అడ్మిన్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే ఐటీ చట్టం చెబుతోన్న విషయం తెలిసిందే.దీంతో వారికి కూడా రిస్క్ తప్పనుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది