WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ .. చాటింగ్ ను ఇతరులకు కనిపించకుండా ఇలా చేయండి
WhatsApp : ప్రస్తుతం వాట్సాప్ లేని ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అందుకే వాట్సప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే వాట్సాప్ చాలా ఫీచర్స్ ను పరిచయం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. లాక్ చాట్ పేరుతో వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇటీవల ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్ తో వినియోగదారులు తాము కోరుకుంటున్న చాట్ ను ఇతరులకి కనిపించకుండా చేసుకోవచ్చు.
మరో వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్ ఎవరికి కనిపించకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాంటాక్ట్ ను పాస్ వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ తో ప్రోటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు తీసుకున్న కాంటాక్ట్ చాట్ బాక్స్ లో కూడా కనిపించదు. అలాగే కాంటాక్ట్ నుంచి మెసేజ్ వచ్చిన పైన కనిపించే నోటిఫికేషన్ లో మెసేజ్ కనిపించదు. లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాక్ చేసిన వెంటనే ఇన్ బాక్స్ లో ఆ మెసేజ్ కనిపించదు. మరో ఫోల్డర్ లోకి వెళ్లి పోతుంది. ఆ ఫోల్డర్ ను పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ తో మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.
లాక్ చేసిన చాట్ నుంచి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిన ఆటోమేటిక్ గా హైడ్ అవుతుంది. మొదట వాట్సాప్ లో అప్డేట్ చేసుకొని ఆ తర్వాత ఏ చాట్ ని బ్లాక్ చేయాలని భావిస్తున్నారో దాన్ని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి. కొత్తగా చాట్ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిసప్పియరింగ్ మెసేజ్ మెను కింద కనిపిస్తుంది. ఇప్పుడు చాట్ లాక్ ను ఎనేబుల్ చేయాలి. దీనికోసం పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. వెంటనే చాట్ లాక్ అవుతుంది. లాక్ చేసిన చాట్ ను చూడాలంటే వాట్సాప్ హోం పేజ్ ని కిందకి స్వైప్ చేయాలి. పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాట్ లో కనబడుతుంది.