WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ .. ఇకపై అది తప్పనిసరి ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ .. ఇకపై అది తప్పనిసరి !

WhatsApp : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగితేలుతుంటారు. అందుకే వాట్సాప్ సంస్థ యూజర్ల అందుబాటులోకి మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. ఇక వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ను యూజర్ల అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 November 2022,6:20 pm

WhatsApp : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగితేలుతుంటారు. అందుకే వాట్సాప్ సంస్థ యూజర్ల అందుబాటులోకి మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. ఇక వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ను యూజర్ల అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫీచర్ తో డెస్క్ టాప్లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దీనివలన యూజర్ చాట్ సంభాషణలకు అదనపు సెక్యూరిటీ ఉంటుందని వాట్సాప్ సంస్థ భావిస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనివలన వాట్సాప్ యూజర్ చాట్ సంభాషణలకు మరింత సెక్యూరిటీ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. ఇప్పటివరకు వాట్సాప్ డెస్క్ టాప్ వర్షన్ యాప్ కు ఎలాంటి పాస్వర్డ్ భద్రత లేదనే విషయం అందరికీ తెలిసిందే.

WhatsApp update new feature

WhatsApp update new feature

డెస్క్ టాప్ పై ఒక్కసారి లాగిన్ అయితే తర్వాత లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దీనివలన ఇతర వ్యక్తులు డెస్క్ టాప్లను వినియోగించే సమయంలో వాట్సాప్ యాప్ ను యాక్సెస్ చేయవచ్చు. దీంతో వ్యక్తిగత సమాచారం భద్రతకు ఆటంకం కలుగుతుంది. ఇలా యూజర్ల వాట్సాప్ చాట్ భద్రత ఉండాలని ఉద్దేశంతో స్క్రీన్ లాక్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ డెస్క్ టాప్ పై వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఒకవేళ యూజర్ తన పాస్వర్డ్ ని మర్చిపోతే యాప్ నుంచి లాగౌట్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ సహాయంతో లాగిన్ కావచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది