BRS Party : హస్తం గూటికి 10 మంది కీలక నేతలు.. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఆ నేతలు కాంగ్రెస్‌లోకి?
BRS Party : తెలంగాణలో ఎన్నికల వేళ హస్తం పార్టీకి కొత్త ఊపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జోరుమీదుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో భారీగా క్రేజ్ వచ్చేసింది. దానికి ప్రధాన కారణం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడమే. అక్కడ గెలవడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు ఉండటంతో వేరే పార్టీల్లో ఉన్న పలువురు కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించిందో అప్పుడే రాజకీయం కాస్త వేడెక్కింది. దానికి కారణం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్ దక్కకపోవడం, మరికొందరు ఆశావహులకు కూడా టికెట్ దక్కకపోవడంతో వాళ్లంతా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అందులో కొందరు ఇప్పటికే పార్టీలు మారారు కూడా. మరికొందరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి వారినే కాంగ్రెస్ కూడా టార్గెట్ చేసింది. ప్రజా బలం ఉన్న నేతలకు కాంగ్రెస్ కండువా కప్పడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో సంప్రదింపులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
BRS Party : హస్తందే అధికారం అని ఆశ చూపుతున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని కాంగ్రెస్ నేతలు ఆశ చూపుతున్నారు. అందుకే.. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే.. బీజేపీ పార్టీలోని నేతలకు కూడా కాంగ్రెస్ గాలం వేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ.. ఈ రెండు పార్టీల్లో ప్రజాబలం ఉన్న నేతలు ఎవరు.. ఎవరు పార్టీలోకి వస్తే పార్టీ బలం పెరుగుతుంది అని ఆలోచించి వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన 10 మంది కీలక నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో వాళ్లంతా చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఎన్నికల సమయంలో పలువురు నేతలు బీజేపీ, బీఆర్ఎస్ ను వీడటం ఆ పార్టీలకు మైనస్ కానుంది.