Today Top News : నా దగ్గర డబ్బులు లేవన్న ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి.. మేం అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తాం.. జమ్మికుంటలో బీఆర్ఎస్ ప్రభంజనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Top News : నా దగ్గర డబ్బులు లేవన్న ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి.. మేం అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తాం.. జమ్మికుంటలో బీఆర్ఎస్ ప్రభంజనం

 Authored By kranthi | The Telugu News | Updated on :10 November 2023,9:08 pm

ప్రధానాంశాలు:

  •  టికెట్ ఇచ్చి బీ ఫాం ఇవ్వకపోవడంతో కంటతడి పెట్టిన తుల ఉమ

  •  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో కత్తిపోటుల కలకలం

  •  కామారెడ్డిలో జై కర్ణాటక అన్న సిద్దరామయ్య

Today Top News : నా దగ్గర డబ్బులు లేవు.. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. మీరే నన్ను గెలిపించాలని ములుగు నియోజకవర్గ ప్రజలను ఆమె కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలు కాదు.. 48 గంటల కరెంట్ ఇస్తామని మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, కూటూరి మానవతారాయ్, ఎడవెల్లి కృష్ణ, వూకె అబ్బయ్య, డా.రామచంద్రునాయక్ తదితరులు చేరారు.

హుజురాబాద్ జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

కొడంగల్ లో రేవంత్ రెడ్డిని, గోషామహల్ లో రాజా సింగ్ ను, హుజురాబాద్ లో ఈటెలను.. ఈ ముగ్గురినీ ఓడిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కామారెడ్డి సభలో కేసీఆర్ తల్లి గురించి అవమానకరంగా రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన ప్రజలు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బహిరంగ సభలో జై కర్ణాటక అని ప్రసంగం ముగించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.

జనసేన గుర్తుపై ఎన్నికల సంఘం స్పందించింది. జనసేన బీ ఫామ్ ఉన్న అభ్యర్థులకు ఈసీ గ్లాస్ సింబర్ కేటాయించనుంది. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఫ్రీ సింబల్ గా గ్లాస్ గుర్తు ఉండనుంది.

కోరుట్లో ఎన్నికల ప్రచారంలో సీఎం సీఎం అంటూ ఈటల రాజేందర్ అభిమానులు కోలాహలం సృష్టించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య దాడి. అక్రమ సంబంధమే కారణం అంటున్న ఉద్యోగులు.

టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో తుల ఉమ మీడియా ముందు కంటతడి పెట్టారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది