PM Kisan : రైతులు అలర్ట్‌ .. పీఎం కిసాన్ లబ్ధిదారులకు షాక్‌.. జాబితా నుండి 32 వేల మంది తొలగింపు.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

 Authored By sudheer | The Telugu News | Updated on :20 March 2026,10:30 am

ప్రధానాంశాలు:

  •  PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారులకు షాక్‌ .. జాబితా నుండి 32 వేల మంది తొలగింపు ..!

PM Kisan : తెలంగాణలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ప్రమాణాలను పాటించకుండా సాయం పొందుతున్న 32,000 మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. ఈ చర్యతో వారికి అందుతున్న పంట పెట్టుబడి సాయం పూర్తిగా నిలిచిపోయింది. ఈ-కేవైసీ ప్రక్రియలో ఆధార్ లింకింగ్ తర్వాత అసలు వివరాలు బయటపడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా చేపట్టిన పరిశీలన కార్యక్రమంలో ఆదాయపు పన్ను చెల్లించే వారు, భూములు విక్రయించిన వారు, ఒకే కుటుంబంలో ఒకరికి మించి సాయం పొందుతున్న వారు వంటి అనర్హులను గుర్తించారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. తద్వారా మరికొంత మంది కూడా అనర్హుల జాబితాలో చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పథకం నిజమైన రైతులకు మాత్రమే చేరాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

PM Kisan : రైతులు అలర్ట్‌ .. పీఎం కిసాన్ లబ్ధిదారులకు షాక్‌.. జాబితా నుండి 32 వేల మంది తొలగింపు.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan : రైతులు అలర్ట్‌ .. పీఎం కిసాన్ లబ్ధిదారులకు షాక్‌.. జాబితా నుండి 32 వేల మంది తొలగింపు.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan : పీఎం కిసాన్ నిబంధనలు .. ఎవరు అర్హులు?

పీఎం కిసాన్ పథకం ప్రకారం ఒక కుటుంబంలో ఒక్క రైతుకే సాయం అందించాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, అధిక ఆదాయ వర్గాలకు చెందినవారు ఈ పథకానికి అర్హులు కారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడమే ఈ పథక లక్ష్యం. అయితే గతంలో చాలా మంది అర్హత లేకపోయినా సాయం పొందుతున్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఇక దేశవ్యాప్తంగా కూడా పీఎం కిసాన్ జాబితాలో శుద్ధి చేపట్టారు. ఇటీవల విడుదలైన 22వ విడత సాయంలో సుమారు 3.8 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. దీంతో కేంద్రం కూడా పథక అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టమైంది.

PM Kisan : రైతు భరోసా, ఏపీలో అన్నదాత సుఖీభవ చెల్లింపులు

తెలంగాణలో రైతులకు మరో ఊరటగా రైతు భరోసా పథకాన్ని మార్చి నెల నుంచే ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఇందులో మార్చిలో రూ. 4,500 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ. 4,500 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ సాయానికి రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తుండగా, త్వరలోనే నిధులు అందనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నిధులు ఇప్పటికే జమయ్యాయి. ఒక్కో రైతు ఖాతాలో రూ. 6,000 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇందులో కేంద్రం వాటా రూ. 2,000 కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000 అందించింది. మొత్తం 46.80 లక్షల మంది రైతులకు రూ. 2,808 కోట్లను విడుదల చేశారు. ఏపీలో ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 20,000 పెట్టుబడి సాయం అందుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. 14,000 చెల్లించగా తాజా విడతతో మిగిలిన మొత్తం రైతులకు చేరింది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల సమన్వయంతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యంగా కనిపిస్తోంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి