School Holidays : విద్యార్థులకు పండగే .. వరుసగా మూడు రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

 Authored By suma | The Telugu News | Updated on :4 February 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  School Holidays : విద్యార్థులకు పండగే .. వరుసగా మూడు రోజులు సెలవులు .. ఎప్పుడెప్పుడంటే..?

School Holidays : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల Telangana Municipal Elections ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు నామినేషన్ల స్వీకరణ కూడా పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్  Polling on February 11 నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.

School Holidays : విద్యార్థులకు పండగే .. వరుసగా మూడు రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

School Holidays : విద్యార్థులకు పండగే .. వరుసగా మూడు రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

School Holidays : పోలింగ్, కౌంటింగ్ నేపథ్యంలో సెలవుల చర్చ

ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్  Polling  దృష్ట్యా ఎన్నికలు జరుగనున్న పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అక్కడి కంపెనీలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి కూడా ఆ రోజు హాలిడే ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా ఆ రోజుకూ సెలవు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

School Holidays : వరుస సెలవులతో విద్యార్థులకు ఊరట?

కౌంటింగ్  Counting  రోజైన ఫిబ్రవరి 13న సెలవు ప్రకటిస్తే విద్యార్థులకు వరుసగా మూడ్రోజులు సెలవులు  Three days holidays  వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 14 రెండో శనివారం కావడంతో స్కూళ్లకు సాధారణ సెలవు ఉంటుంది. ఇక ఫిబ్రవరి 15 ఆదివారం కావడంతో మరో సెలవు కలిసివస్తుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఈ అంశంపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

School Holidays : ఉపాధ్యాయ సంఘాల వినతులు – ప్రభుత్వ స్పందన

ఇదిలా ఉండగా తెలంగాణ టీచర్స్ ఐకాస (టీజీ టీజాక్) నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక, ఆర్థికేతర, శాఖాపరమైన అంశాలపై సమగ్రంగా వివరించిన వారు తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఎస్, ఆర్థికేతర సమస్యలను వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తానని హామీ ఇచ్చినట్లు ఐకాస నేతలు తెలిపారు. ఆర్థిక అంశాల విషయమై బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేకంగా చర్చించి పరిష్కరిస్తామని కూడా ఆయన స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం టీజీ టీజాక్ నేతలు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్‌ను కూడా కలిసి తమ సమస్యలను విన్నవించారు. వీరిద్దరూ కూడా సానుకూలంగా స్పందించారని త్వరలో పరిష్కార దిశగా అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా, విద్యారంగాల్లో చురుకుదనం కనిపిస్తోంది. అధికారిక ఉత్తర్వులతో స్పష్టత రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

 

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి