Constable : ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్..!
ప్రధానాంశాలు:
Constable : ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్..!
Constable : డబ్బుల విషయంలో ఆమెను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతికి, న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి. కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదాం అని ఇంటికి పిలిపించుకొని,
తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అదే ఏడాది జూలైలో ఆమె గర్భం దాల్చగా, భయంతో యువతికి బలవంతంగా అబార్షన్ చేయించిన సుధాకర్ రెడ్డి ఆగస్టులో కానిస్టేబుల్‌కి పెళ్ళైందని తెలిసి, తాను మోసపోయానని గ్రహించి నిలదీసిన యువతి.. దీంతో యువతి అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్న కానిస్టేబుల్ ఒక రోజు యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించి, కొన్ని రోజుల తర్వాత ఆమెను ఇంటికి పిలిపించుకుని దాడి చేసి,..
మరోసారి బండిపై ఎక్కించుకొని కిందకి తోసి ఇలా పలుమార్లు యువతిపై దాడి చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ఈ నెల 3న కమిషనరేట్లో యువతి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండుకు తరలించిన పోలీసులు