Viral Video : ఓ యువ రైతు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్…2 కిలోమీటర్లు భుజానమోసి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఓ యువ రైతు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్…2 కిలోమీటర్లు భుజానమోసి…!

Viral Video : తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందర్నీ ఆకట్టుకుంటుంది..అతను చేసిన పని తన మంచి మనసును చాటుకుంటుంది. అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ రైతును కాపాడేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా 2 కిలోమీటర్ల మేర మందు తాగిన రైతును ఎత్తుకుని మోసుకెళ్లాడు. సరైన సమయంలో స్పందించి ఆ రైతు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ పై ఇప్పుడు నలువైపుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది అని […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 March 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : ఓ యువ రైతు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్...2 కిలోమీటర్లు భుజానమోసి...!

Viral Video : తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందర్నీ ఆకట్టుకుంటుంది..అతను చేసిన పని తన మంచి మనసును చాటుకుంటుంది. అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ రైతును కాపాడేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా 2 కిలోమీటర్ల మేర మందు తాగిన రైతును ఎత్తుకుని మోసుకెళ్లాడు. సరైన సమయంలో స్పందించి ఆ రైతు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ పై ఇప్పుడు నలువైపుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పాలి.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే….కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతికల్ కు చెందిన సురేష్ అనే ఓ యువ రైతు ఇటీవల తన ఇంట్లో గొడవపడి పొలానికి వెళ్లడం జరిగింది. ఇక తన జీవితంపై విసుగు చెందిన రైతు సురేష్ తన పొలంలో దాచిన పురుగుల మందులు తీసుకుని తాగాడు.

అయితే అక్కడ సమీపంలో ఉన్న మరి కొందరు అది గమనించి 100 కు కాల్ చేయగా వెంటనే బ్లూ కొల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్ మరియు హోంగార్డ్ కిన్నెర సంపత్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక అప్పటికే రైతు సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అంబులెన్స్ కు కాల్ చేసి అది వచ్చేవరకు వేచి చూస్తే రైతు ప్రాణాలు దక్కే అవకాశం లేదని భావించిన కానిస్టేబుల్ జయపాల్…రైతు సురేష్ ను తన భుజం పై వేసుకొని పొలాల మీదుగా దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడినుండి కుటుంబ సభ్యుల సహాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికిి తరలించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లిన వెంటనే సురేష్ కు వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు.

అయితే ప్రస్తుతం సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఇక సకాలంలో స్పందించి సురేష్ ప్రాణాలను కాపాడిన బ్లూ కొల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్ ను పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు , స్థానికులు ఇతర సిబ్బంది అభినందించారు. సురేష్ ప్రాణాలు కాపాడిన జయపాల్ కాళ్ళను పట్టుకుని రైతు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన జయపాల్ పై ప్రస్తుతం సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది