VH : వీహెచ్‌కు కీలక పదవి.. ఊహించని రేవంత్ ట్విస్ట్ ?
ప్రధానాంశాలు:
VH : వీహెచ్‌కు కీలక పదవి.. ఊహించని రేవంత్ ట్విస్ట్ ?
VH : తెలంగాణలో Telangana స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతపైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్ Revanth reddy కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వీహెచ్ VH కు కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం.

VH : వీహెచ్‌కు కీలక పదవి.. ఊహించని రేవంత్ ట్విస్ట్ ?
మండలి చైర్మన్‌గా వీహెచ్ ?
పార్టీ సీనియర్ నేత వీహెచ్ v. hanumantha rao కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. వీహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించారు. కానీ, సామాజిక – క్షేత్ర స్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. అందుకే శాసన మండలి చైర్మన్ Council Chairman పదవి వీహెచ్‌కు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి revanth reddy యోచిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెలీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒకటి వీహెచ్‌కు ఇవ్వడంతో పాటు ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది.
రెండు పదవులు..
వీహెచ్‌ను మండలి చైర్మన్‌గా నియమించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ చైర్మన్‌గా కూడా నియమిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కుల గణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ నేతలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం. వీహెచ్‌తోపాటు పలువురు బీసీ నేతలకు పార్టీ పదవులు ఇస్తారని సమాచారం.