Anchor Shyamala : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్...!
Anchor Shyamala : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పోలింగ్ కు మరో వారం రోజులు గడువు ఉండడంతో అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా గడపగడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థులు కలుస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రముఖ సినీ నటులు యాంకర్లు కూడా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ ఆర్టిస్టులు మెగా హీరోలు సైతం ప్రచారాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు వైసీపీ పార్టీ తరఫున ప్రముఖ యాంకర్ శ్యామల ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాలలో చాలా చురుగ్గా పాల్గొంటూ పవన్ మరియు చంద్రబాబు పై కామెంట్ చేసిన యాంకర్ శ్యామల తాజాగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతుంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలను రక్షిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సాధించే సీట్లపై పలుచోట్ల వేరువేరు సందర్భాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు రకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ నామినేషన్ ర్యాలీలో మాట్లాడిన కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి రెండు ఎంపీ సీట్లు కూడా రావని వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అదేవిధంగా మరోచోట కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు కూడా రావని వస్తే తాను రాజకీయాలు చేయనని సవాల్ విసిరారు. అయితే కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాజాగా ప్రముఖ యాంకర్ శ్యామల షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
Anchor Shyamala : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల సెటీరికల్ కామెంట్స్…!
ఈ సందర్భంగా శ్యామల కోమటిరెడ్డి మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ…వారం వ్యవధిలోని 2 నుండి 8 వచ్చింది. మరో వారం రోజుల్లో 8 నుండి ఎక్కడికి పోతుందో…? ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని అంటూ క్యాప్షన్ రాసుకోచ్చారు. యాంకర్ శ్యామల బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసిన ఈ సేటారికల్ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ పై నేటిజనులు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మీరు నిజం చెప్పారని కామెంట్స్ చేస్తుంటే…నీకు రాజకీయాలు అవసరమా అంటూ మరికొందరు మండిపడుతున్నారు…మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.