Pratap Singaram : ప్రతాపసింగారం Z.P.H.S లో ఘనంగా ని వార్షిక దినోత్సవ వేడుకలు
ప్రధానాంశాలు:
Pratap Singaram : ప్రతాపసింగారం Z.P.H.S లో ఘనంగా ని వార్షిక దినోత్సవ వేడుకలు
Pratap Singaram : మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారం Z.P.H.S స్కూల్ లో ఈరోజు వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు – IT,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు శాసన వ్యవహారాల మంత్రి,మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు,మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు,రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు,మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు,కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు & మాజీ ZP చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు,పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ గారు హాజరైనారు.

Pratap Singaram : ప్రతాపసింగారం Z.P.H.S లో ఘనంగా ని వార్షిక దినోత్సవ వేడుకలు
విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు విద్య, క్రమశిక్షణ, నైతికత ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ వారి పాత్రను గౌరవించారు. స్కూల్ అభివృద్ధికి సంబంధించి కొత్త ప్రణాళికలు, సదుపాయాల కల్పనపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, “నేటి విద్యార్థులు రేపటి భారత భవిష్యత్తు. వారికి మంచి విద్య అందించడమే సమాజ బాధ్యత” అని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం స్కూల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ వేడుకలో ప్రజా ప్రతినిధులు,ఇతర ప్రముఖులు,విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.