Babu Mohan: తెలంగాణా బీజీపీనీ కుదిపేస్తున్న బాబు మోహన్ ఆడియో.. నువ్వెంత నీ బతుకెంత అంటూ డైలాగులు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Babu Mohan: తెలంగాణా బీజీపీనీ కుదిపేస్తున్న బాబు మోహన్ ఆడియో.. నువ్వెంత నీ బతుకెంత అంటూ డైలాగులు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :7 February 2023,10:50 am

Babu Mohan: మాజీమంత్రి బాబు మోహన్ అందరికీ సుపరిచితుడే. బీజేపీ పార్టీలో రాణిస్తున్న బాబు మోహన్ సొంత పార్టీ కార్యకర్తపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే జోగిపేట కు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త బాబు మోహన్ కి ఫోన్ చేసిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీతో కలిసి పార్టీలో పని చేస్తానని బాబు మోహన్ కి కార్యకర్త ఫోన్ చేయక తనకు మరోసారి ఫోన్ చేయొద్దని సదరు వెంకటరమణ అనే కార్యకర్తకు బాబు మోహన్ వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు మరోసారి ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానని చాలా ఘాటుగా విమర్శలు చేసినట్టు ఆడియోలో వినిపిస్తోంది. అంతేకాదు తాను కావాలో నీవు కావాలో పార్టీతో తేల్చుకుంటానని కూడా బాబు మోహన్ చెప్పుకొచ్చారు. ఇంకా ఇదే సమయంలో తాను ప్రపంచ స్థాయి నాయకుడిని తనని తాను బాబు మోహన్ అభివర్ణించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టీ కోసం పనిచేయడానికి తనని అమిత్ షా పార్టీలో జాయిన్ చేసుకున్నట్లు వెంకటరమణతో చెప్పినట్లు ఆడియో సంభాషణలో తెలుస్తోంది. నీవెంత నీ బతుకెంత అని కూడా బీజేపీ కార్యకర్తపై బాబు మోహన్ మండిపడటం జరిగింది. అంతేకాదు అవసరమైతే తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కూడా బాబు మోహన్ వ్యాఖ్యలు చేసినట్లు ఆడియో సంభాషణలో తెలుస్తోంది.

Audio of Babu Mohan shaking Telangana BJP

Audio of Babu Mohan shaking Telangana BJP

ఇదే సమయంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎవడ్రా… వాడు నా తమ్ముడని చెప్పుకొచ్చారు. అవసరమైతే రేపే బిజెపికి రాజీనామా చేస్తాను. జోగిపేట నియోజకవర్గం సంబంధించి నువ్వు కావాలో నేను కావాలో పార్టీ తేల్చుకుంటుందని.. బాబు మోహన్ డైలాగులు వైరల్ గా మారాయి. అయితే ఆడియోలో మాట్లాడిన స్వరం బాబు మోహన్ దో…కాదో అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. బాబు మోహన్ పేరిట వైరల్ అవుతున్న ఈ ఆడియోపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది