Bairi Naresh : ఎర్రవరం లక్ష్మీనరసింహ స్వామి పెద్ద డ్రామా.. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడా మీ దేవుడు… ? బైరి న‌రేష్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bairi Naresh : ఎర్రవరం లక్ష్మీనరసింహ స్వామి పెద్ద డ్రామా.. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడా మీ దేవుడు… ? బైరి న‌రేష్‌

 Authored By kranthi | The Telugu News | Updated on :9 August 2023,6:00 pm

Bairi Naresh : ప్రస్తుతం తెలంగాణలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎర్రవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం గురించే చర్చ నడుస్తోంది. ఆ ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. ఒక బాలుడి మీద బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి పూనడంతో పాటు దూళ్లగుట్ట మీద బాల ఉగ్రనరసింహ స్వామి వెలిశాడని నమ్ముతున్నారు భక్తులు. అక్కడికి రోజూ భక్తులు లక్షల సంఖ్యలో వెళ్తున్నారు.

ప్రతి శుక్రవారం చాలా రద్దీ ఉంటుంది అక్కడ. పండు స్వామిని దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు చాలా మంది వెళ్తున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. వేరే రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. అందుకే ఆ గుడి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే.. ఆ గుడిపై కూడా ప్రముఖ నాస్తికుడు బైరి నరేషన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అసలు అక్కడ ఏం జరుగుతోందో బైరి నరేష్ కళ్లకు కట్టినట్టు వివరించారు. అసలు అక్కడ దేవుడే లేడన్నారు. ఉగ్ర బాలనరసింహ స్వామి అనేది అంతా బుటకం అన్నారు. వంద చానెళ్లు ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ.. అసలు దాని తెర వెనుక ఏం జరుగుతుందో అని తెలుసుకోగలుగుతారా? అక్కడికి వెళ్తే తరిమి తరిమి కొడతారు అని బైరి నరేష్ చెప్పుకొచ్చారు.

bairi naresh comments on yerravaram bala ugra narasimha swamy temple

bairi naresh comments on yerravaram bala ugra narasimha swamy temple

Bairi Naresh : అసలు అక్కడ దేవుడే లేడు

అక్కడికి వెళ్లి మొక్కగానే కడుపు అవుతోందని అంటున్నారు. ఒక బాలుడు ఉగ్రనరసింహ స్వామి అవతారం ఎత్తి పూనకాలు వచ్చి వాక్కు చెబుతున్నాడు. అక్కడికి వెళ్లడం వల్లనే కడుపు అయింది.. నా కేసు సాల్వ్ అయింది.. అంటూ చెబుతున్నారు. కేసు ఎప్పటి నుంచి విచారణ జరిగితే సాల్వ్ అయింది.. ప్రెగ్నెన్సీ ఎలా వస్తోంది.. అంటూ బాల ఉగ్రనరసింహ స్వామి ఆలయంపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది