Bandi Sanjay : బండి సంజయ్ కంటున్న ఆ ‘కల’ నెరవేరేనా.. కేసీఆర్ ను అలా చూస్తామా?
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్బంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారంను రేపుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్గాల వారు ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. బండి సంజయ్ దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ సొంత పార్టీ నాయకులు కితాబిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
Bandi Sanjay : భయపడకుంటే ఉద్యోగులను ఎందుకు కలిశావ్..
టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అన్నట్లుగా భయాందోళనతో ఉంది. ఆ భయంతోనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగి పార్టీ నాయకులకు మార్గదర్శకం చేశాడు. ఖచ్చితంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంతా కూడా ఓటమి ఖాయం అనే ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఫిట్ మెంట్ ను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉందన్న కేసీఆర్ ఇప్పుడు ఈ ఫిట్ మెంట్ ఎలా ఇస్తాడంటూ బండి సంజయ్ ప్రశ్నించాడు.

Bandi Sanjay
Bandi Sanjay : బండి సంజయ్ కల..
2023లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం.. గోల్కొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. గోల్కొండపై బీజేపీ జెండా ఎగురుతున్న సమయంలో కేసీఆర్ ఆ దృశ్యంను చూడాలని కోరుకుంటున్నట్లుగా బండి సంజయ్ అన్నాడు. కేసీఆర్ బీజేపీ అధికారంలో కి వచ్చే విషయాన్ని చూస్తూ ఉండాలని అప్పుడు తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఆ సంఘటన అతి త్వరలో జరుగబోతుందని బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్ కలలు చూస్తుంటే కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. కాని కేసీఆర్ ను తెలంగాణ జనాలు అలా చూడబోతున్నారా అంటే ఇప్పట్లో అలా ఏమీ జరుగక పోవచ్చు అంటున్నారు.