Bandi Sanjay : బండి సంజయ్ సెల్ఫ్ గోల్, కే‌సి‌ఆర్ ని చాలా చాలా తక్కువ అంచనా వేశావయ్యా బండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandi Sanjay : బండి సంజయ్ సెల్ఫ్ గోల్, కే‌సి‌ఆర్ ని చాలా చాలా తక్కువ అంచనా వేశావయ్యా బండి !

 Authored By himanshi | The Telugu News | Updated on :4 February 2021,12:36 pm

Bandi Sanjay  : తెలంగాణ సీఎం కేసీఆర్‌ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పులో కాలు వేశాడా అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ముల్లును ముల్లుతో తీయాలి అనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ను ఆయన భాషలోనే బండి సంజయ్ డీల్‌ చేయాలని భావించాడు. కాని అది సాధ్యం కావడం లేదు. బండి సంజయ్ ఇటీవల కేసీఆర్‌ ను వ్యక్తిగత దూషణలతో విమర్శలు చేయడం జరిగింది. దాంతో అప్పటి నుండి ఆయనకు జనాలు చుక్కులు చూపిస్తున్నారు. ఆయన విషయంలో కేసీఆర్‌ అభిమానులు వ్యవహరిస్తున్న తీరుతో బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్తితి ఏర్పడింది. నిజామాబాద్‌ లో బండి సంజయ్ ఎదుర్కొన్న సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ విషయంలో తప్పుడు అంచనా… : bandi sanjay

కేసీఆర్ ను తక్కువ చేసేందుకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ఆయన్ను జనాల్లో తక్కువ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించిన బండి సంజయ్‌ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తిరగడం కూడా కష్టం గా మారింది. కేసీఆర్ విషయంలో బండి సంజయ్ తక్కువ అంచనా వేశాడు. ఆయనపై జనాల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న బండి సంజయ్‌ అనవసరపు విమర్శలు చేస్తున్నాడు అంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

bandi sanjay self goal about telangana cm kcr

bandi sanjay self goal about telangana cm kcr,

ఇకపై అయినా జాగ్రత్త బండి..

కేసీఆర్‌ విషయంలో విమర్శలు చేసే సమయంలో కాస్త హద్దుల్లో ఉండాలంటూ ఈ సందర్బంగా సొంత పార్టీ నాయకులు స్వయంగా బండికి సూచిస్తున్నారు. నేడు కాకుంటే రేపు కేంద్రంలో కేసీఆర్‌ మోడీతో సన్నిహిత్యంగా మారే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసే ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి రావచ్చు. కనుక కేసీఆర్‌ విషయంలో మరీ వ్యక్తిగత విమర్శలు సరి కావు అంటూ బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది