Home » News » Bandi Sanjay Sensational Comments On Cm Kcr
News

Bandi sanjay : ప్రగతి భవన్ లో కేసీఆర్ గల్లా పట్టుకుంటా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Authored By
Brahma
The Telugu News | Updated on: March 16, 2021 12:19 pm
Advertisement

Bandi sanjay : తెలంగాణలో గత ఏడాది వరకు సీఎం కేసీఆర్ ను విమర్శించే దమ్ము, దైర్యం కలిగిన నేతగా ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కనిపించేవాడు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు తీసుకున్నాడో, అప్పటి నుండి రేవంత్ రెడ్డి వెనుకబడిపోయాడు. ఈటెల లాంటి మాటలతో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. తాజాగా జరిగిన బైంసా అల్లర్ల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ను ప్రగతి భవన్ లో గల్లా పట్టుకుంటా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

Bandi sanjay sensational comments on cm kcr

Bandi sanjay : కేసీఆర్ హిందువులను టార్గెట్ చేశాడు !

రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికే కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ హిందువులని హింసిస్తుందని అన్నారు. బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ప్రభుత్వం పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

మహారాష్ట్ర నుండి బహిష్కరించిన కొందరు లుచ్చాలు బైంసాలో అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు. పొడిచింది హిందువులనే అని, ఆస్తుల ధ్వంసం అయ్యింది హిందువులవే అని, అరెస్ట్ చేసింది హిందువులనే అని ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు దుర్మార్గులు కలిసి హిందు కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పసిపాప మీద అత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు. త్వరలోనే ప్రగతిభవన్‌లోకి చొరబడి సీఎం గల్లా పట్టుకొని ప్రశ్నిస్తామని బండి సంజయ్ అన్నారు.

అయితే బండి సంజయ్ కేసీఆర్ మీద ఎంతటి విమర్శలు చేసిన కానీ తెరాస నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు తప్పితే, తిరిగి ఒక్క మాట కూడా బండి సంజయ్ ను అనటం లేదు. కావాలనే బండి సంజయ్ విషయంలో తెరాస నేతలు సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. బండి సంజయ్ తో మాటకు మాట దిగితే అనవసరంగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని భావించి, బండి సంజయ్ మీద తెరాస ద్వితీయ శ్రేణి నేత కూడా మాట్లాడటం లేదు. అయితే ఇదే ఊపులో సంజయ్ మాత్రం దూసుకొని వెళ్తూ, కేసీఆర్ ను ఇరుగున పెట్టె వ్యాఖ్యలు చేస్తున్నాడు..

Brahma

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి