Bandi Sanjay : బీజేపీ అధ్యక్ష మార్పు గురించి మనసులో మాట చెప్పేసిన బండి సంజయ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandi Sanjay : బీజేపీ అధ్యక్ష మార్పు గురించి మనసులో మాట చెప్పేసిన బండి సంజయ్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :30 June 2023,1:00 pm

Bandi Sanjay : గత రెండు మూడు రోజుల నుంచి ఇదే హడావుడి. తెలంగాణ బీజేపీ రాజకీయాలను కుదిపేసే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అసలు దాన్ని ఎవరు వైరల్ చేశారో తెలియదు కానీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారు అంటూ వార్తలు పుంఖానుపుంఖలుగా వచ్చి చేరాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ప్రస్తుతం బండి సంజయ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను మార్చి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఆ స్థానం కట్టబెడతారని.. బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి.

ఈ వార్త కేంద్ర పెద్దలకు చేరడంతో అలాంటిదేమీ లేదని ఏకంగా తరుణ్ చుగ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై చివరకు బండి సంజయ్ కూడా స్పందించారు. నన్ను మారుస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కూడా వార్తలను ప్రచారం చేశాయి. ఆ వార్తలు ఒకసారి రెండుసార్లు కాదు.. చాలాసార్లు వచ్చాయి. వాటిని చూసి చూసి మా కార్యకర్తలకు కూడా అలవాటు అయింది. రాసి రాసి మీడియా వాళ్లకు కూడా అలవాటు అయినట్టుంది. అసలు ఎక్కడైనా నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. నిప్పు లేకుండా పొగ ఎక్కడా రాదు. దాదాపు సంవత్సరం నుంచి నన్ను మారుస్తారంటూ వార్తలు వస్తున్నాయి.. అంటూ బండి సంజయ్ అన్నారు.

bandi sanjay statement about telangana bjp president change

bandi sanjay statement about telangana bjp president change

Bandi Sanjay : ఇదంతా కేసీఆర్ లాంటి మూర్ఖుడు చేస్తున్న కుట్ర

ఇదంతా కేసీఆర్ లాంటి మూర్ఖుడు చేస్తున్న కుట్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు పక్క పార్టీల్లో పొగ పెట్టేందుకే చూస్తుంటారు. మా కార్యకర్తలు ఎవరూ వీటిని పెద్దగా పట్టించుకోరు. నన్ను తీసేస్తే వీళ్లకు వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నన్ను చూసి వీళ్లంతా భయపడుతున్నారు. బీజేపీ అంటేనే వీళ్లకు భయం. అందుకే మా పార్టీలో లొల్లీలు పెట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కుట్రలో భాగం ఇది. దీన్ని మేము నమ్మం.. నమ్మబోం అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది