Bandla Ganesh : మరోసారి కేటీఆర్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandla Ganesh : మరోసారి కేటీఆర్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Bandla Ganesh : మరోసారి కేటీఆర్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత పండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఆయన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్ పెట్టింది పేరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వైరల్ గా మారుతుంటారు. ఇక బండ్లన్న కాంగ్రెస్ పార్టీకి సానిభూతిపరుడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని ప్రశంసలతో ముంచెత్తారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనపై బండ్ల గణేష్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ అమలు చేసి చూపించిందని కొనియాడారు. రాజకీయం చేయకుండా ప్రజాపాలన చేస్తుందని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడని అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రజల కోసం 24 గంటలు కష్టపడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి దేశం మాట్లాడుతుందని అన్నారు.

అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ఆనందంగా ఉందని కొనియాడారు. సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరిన్ని పథకాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజలంతా అందుకు సహకరించాలని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అని బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రజా పాలన అంటే ఏంటో చూపించారు. ఎక్కడ అక్రమాలు దౌర్భాగ్య అనుభవించేది లేకుండా ప్రజా పాలన అంటే ఏంటో రేవంత్ రెడ్డి చూపించారు అని కొనియాడారు బండ్ల గణేష్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది