Barrelakka Shirisha : బర్రెలక్కకు అండగా హైకోర్టు, సుప్రీం కోర్టు లాయర్లు.. శిరీష కోసం ఇండియాలో లాండ్ అయిన అమెరికాలో పేరుపొందిన లాయర్
ప్రధానాంశాలు:
బర్రెలక్కకు కవిటి శ్రీనివాస రావు నుంచి మద్దతు
రిజిస్టర్ పార్టీలో బర్రెలక్కకు స్థానం
హైకోర్టు, సుప్రీం కోర్టు తెెలుగు లాయర్ల మద్దతు బర్రెలక్కకే
Barrelakka Shirisha : బర్రెలక్క శిరీష తమ్ముడి మీద దాడి జరగడంతో చాలామంది స్పందించారు. కొందరు లాయర్లు తన దగ్గరికి వచ్చి ఉచితంగా తనకు మద్దతు ఇస్తామని.. కేసుల విషయంలో, ఇతర విషయాల్లో తనకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. అమెరికా నుంచి తెలుగు అడ్వకేట్లు.. అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన వారు కవేటి శ్రీనివాస రావు వెంటనే అమెరికా నుంచి వస్తున్నారని.. ఆయన ప్రోగ్రామ్స్ ను మానిటర్ చేయడం కోసం హైకోర్టు అడ్వకేట్స్ వచ్చారు. కొల్లాపూర్ కు కవిటి శ్రీనివాస్ రావు వచ్చి బర్రెలక్కకు మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. లండన్ నుంచి కొందరు బర్రెలక్క కోసం విరాళాలు పంపిస్తున్నారు. కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఈ విషయాన్ని ఆలోచించాలి. బర్రెలక్క నామినేషన్ వేయడానికి కనీసం 5 వేలు లేవు అంటే.. సొంత రాష్ట్రంలో నిరుద్యోగత ఎంత ఉందో అర్థం అవుతోంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండి.. దేశమంతా ఇస్తామంటే మేము నమ్ముతామా అని మండిపడ్డారు.
బర్రెలక్క నామినేషన్ దేశంలో ఉన్న 30 నుంచి 40 కోట్ల మంది నిరుద్యోగులకు ఒక సింబల్. బర్రెలక్కను ఏదైనా రిజిస్టర్డ్ పార్టీలో స్థానం కల్పించి.. నిరుద్యోగుల కోసం ఈమెకు టికెట్ ఇచ్చి పార్టీలో స్థానం కల్పించేలా మా శాయశక్తులా పోటీ చేస్తామన్నారు లాయర్స్. బర్రెలక్కకు ఓటేయండి.. మీరు న్యాయవంతులు అయితే విజిల్ నెంబర్ కు ఓటేయండి. 8 సీరియల్ నెంబర్ కు ఓటేయండి. ఒకవేళ బర్రెలక్క గెలిచిన తర్వాత 5 ఏళ్లు నియోజకవర్గంలో ఏం చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈమెకు ఓటేయొద్దని మేమే చెబుతాం. తనకు టికెట్ ఇవ్వకుండా, నామినేషన్ వేయకుండా చేస్తాం అని లాయర్స్ తెలిపారు.
Barrelakka Shirisha : నేను ఏం అభివృద్ధి చేస్తానో బాండ్ పేపర్ మీద రాసి ఇస్తా
నన్ను గెలిపిస్తే నేను ఏం చేస్తానో.. నిరుద్యోగుల తరుపున ఎలా పోరాడుతానో బాండ్ పేపర్ మీద రాసి ఇస్తానని బర్రెలక్క హామీ ఇచ్చారు. హైకోర్టు, సుప్రీం కోర్టు లాయర్లు, బార్ అసోసియేషన్ బర్రెలక్కకు సంపూర్ణ మద్దతు పలికారు. అలాగే.. బార్ అసోసియేషన్ తరుపున భవిష్యత్తులో తమ సొంత ఖర్చులతో బర్రెలక్కను లా చదివించి లాయర్ ను చేస్తామని హామీ ఇచ్చారు.