Bhu Bharati : కొత్త ఫీచర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాలన్న రైతు ఆమోదం తప్పని సరి..!
ప్రధానాంశాలు:
Bhu Bharati : కొత్త ఫీచర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాలన్న రైతు ఆమోదం తప్పని సరి..!
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ మార్పులను అడ్డుకునేందుకు, భూముల రికార్డుల్లో ఏ మార్పు జరిగినా వెంటనే భూమి యజమానులకు సమాచారం వెళ్లేలా భూ భారతి పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొబైల్ యాప్‌ను కూడా రూపొందించేందుకు సాంకేతిక బృందాలు కసరత్తు చేస్తున్నాయి. భూ మార్పులకు యజమాని అంగీకారం తప్పనిసరి చేసే విధంగా సిస్టమ్‌ను డిజైన్ చేయడం ద్వారా అధికారుల ఇష్టారాజ్యాన్ని నిరోధించే ప్రయత్నం జరుగుతోంది.

Bhu Bharati : కొత్త ఫీచర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాలన్న రైతు ఆమోదం తప్పని సరి..!
Bhu Bharati భూ భారతి పోర్టల్ తో ఎన్నో లాభాలు.. అవి ఏంటో మీరే చూడండి
ఇక ధరణి పోర్టల్ ద్వారా గతంలో అనేక భూములు ఉద్దేశ్యపూర్వకంగా నిషేధిత జాబితాలో చేరిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలన్న ఉద్దేశంతో కొంతమంది అధికారి, ప్రబలుల సహకారంతో రైతుల భూములను బ్లాక్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, గండిపేట, కేశంపేట వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూములపై వివాదాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వాటిపై విచారణ కొనసాగుతుండగా, భూ భారతి ద్వారా ఇకపై ఆచరణాత్మకంగా రికార్డులను మార్పు చేయడాన్ని కఠినతరం చేయనున్నారు.
యూజర్ ఫ్రెండ్లీ విధానంతో భూ భారతి పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పాత ధరణి పోర్టల్‌లో ఉన్న 35 మాడ్యూల్స్ బదులుగా, భూమి సంబంధిత అన్ని సేవలను ఏడు ప్రధాన మాడ్యూల్స్‌లో సమీకరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్వోఆర్ కరెక్షన్, నిషేధిత జాబితా, మార్కెట్ విలువలు, అప్పీల్ అండ్ రివిజన్ వంటి అంశాలన్నీ ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. భవిష్యత్తులో భూ రక్షక్, భూధార్ యాప్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తూ, భూములపై ప్రజలకు మరింత సమగ్ర సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తులో భూ వ్యవహారాల్లో న్యాయాన్ని తీసుకురావడంలో కీలకంగా మారనున్నాయి.