ప్రగతిభవన్‌ను గ్రానైడ్స్‌తో పేల్చివేయాలి… రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర స్టార్టింగ్ లోనే అవాంతరాలు ఎదురయ్యాయి. విషయంలోకి వెళ్తే ములుగు జిల్లాలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ రెడ్డి… ప్రగతి భవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు గ్రానైట్స్ తో పేల్చివేయాలని అన్నారు. అంతేకాదు పేదలకు ఇల్లు కట్టేవలేని వాళ్ళు హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకొని భోగాలు అనుభవిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది.
ఆనాడు గడీలను గ్రానైడ్ లతో పేల్చివేసినట్టే ఇప్పుడు ప్రగతి భవన్ నీ పేల్చివేయాలని రేవంత్ రెడ్డి నక్సలైట్లకు పిలుపునిచ్చారు. రెండువేల కోట్ల రూపాయలతో 120 గదులతో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నారు. సామాన్య ప్రజలకు ఎంట్రీ అవ్వకుండా కేవలం ఏపీ పెట్టుబడిదారులను మాత్రమే ఆ భవనంలోకి అనుమతి ఇస్తున్నారు. సామాన్యుడికి ప్రవేశం లేని ప్రగతి భవన్ అవసరమా బాంబులతో పేల్చేయాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అల్లర్లను సృష్టించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక బిఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు ములుగు పోలీస్ స్టేషన్ లో పోలీసులు రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్టు సమాచారం.