Parameshwar Reddy : అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించడమే బీజేపీ లక్ష్యం : పరమేశ్వర్‌రెడ్డి
ప్రధానాంశాలు:
Parameshwar Reddy : అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించడమే బీజేపీ లక్ష్యం : పరమేశ్వర్‌రెడ్డి
Parameshwar Reddy : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమే లక్ష్యంగా దేశంలో బీజేపీ పని చేస్తోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేడ్కర్‌ను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను “అవమానించేలా” పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏఐసీసీ, తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసరం మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశం సోమవారం బాలానగర్ లో సామ్రాట్ హోటల్ జరిగింది.

Parameshwar Reddy
Parameshwar Reddy జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌లో సన్నాహక సమావేశంలో పరమేశ్వర్‌రెడ్డి
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గా శోభారాణి గారు తదితరులు మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ పరమేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. జనవరి 3న ప్రారంభించబడిన ఈ ప్రచారం జనవరి 26, 2026న అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో రాజ్యాంగం మరియు గణతంత్రం యొక్క 76 సంవత్సరాల జ్ఞాపకార్థం ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’తో జరిగే గొప్ప ర్యాలీతో ముగుస్తుంది అని చెప్పారు. దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులను
“కించపరచటానికి” బిజెపి నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకొని హోం మంత్రితో క్షమాపణ చెప్పిస్తారని మేము ఆశించామని.. కానీ ప్రధాని అమిత్ శా కి మద్దతు ఇచ్చి అంబేద్కర్ ని అవమానించడంలో భాగస్వామి అయ్యారు” అని ఆరోపించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు ,కోర్డినేటర్ ఫాయిమ్ గారు వజ్రేష్ యాదవ్ గారు ,భూపతి రెడ్డి గారు ,కోలన్ హనుమంత్ రెడ్డి గారు బండి రమేష్ గారు ,సత్యం శ్రీరంగం గారు ఉప్పల్ నియోజకవర్గ అన్ని డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు