CM KCR : ఓట్లు చీల‌కుండా చ‌క్రం తిప్పుతున్న హ‌స్తం.. కేసీఆర్ కి ఓట‌మి త‌ప్ప‌దా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM KCR : ఓట్లు చీల‌కుండా చ‌క్రం తిప్పుతున్న హ‌స్తం.. కేసీఆర్ కి ఓట‌మి త‌ప్ప‌దా..?

 Authored By gatla | The Telugu News | Updated on :3 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  టీడీపీ, వైఎస్సార్టీపీ నిర్ణయం కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?

  •  బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం లేదా?

  •  బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్

CM KCR : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. అంటే ఈ నెల రోజుల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాబోతోంది. అది అధికార బీఆర్ఎస్ పార్టీనా లేక ఇంకోటా అనేది పక్కన పెడితే తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంలో ఎన్నికల బరిలోకి దిగాయి. అసలు పార్టీల ఎత్తుగడలు చూస్తే ఏమాత్రం తగ్గడం లేదు. ఒక పార్టీని మించి మరోపార్టీ.. వ్యూహాలను పెంచుతూ పోతున్నాయి తప్పితే అస్సలు తగ్గడం లేదు. 2014, 2018 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా కనిపించింది కానీ.. ఈసారి వార్ వన్ సైడ్ కాదు.. అధికార బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎన్నికలు సవాల్ గా మారాయి. నిజానికి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. రైతుల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో స్కీమ్స్ ను తీసుకొచ్చింది. అయినా కూడా ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్ కు సవాల్ గా మారాయి. దానికి కారణం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పుంజుకోవడం.

అసలు ఎవ్వరూ ఊహించని విధంగా అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న బీజేపీని కిందికి నెట్టి మరీ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలోకి వచ్చి చేరింది. అసలు విచిత్రం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఒక్కసారిగా పార్టీకి బలం పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది పక్కన పెడితే అసలు ఈసారి పోటీ చేస్తే డిపాజిట్లు అయినా దక్కుతాయా అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పైకి లేచింది. దీంతో బీఆర్ఎస్ లో అలజడి స్టార్ట్ అయింది. అందులోనూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బాగా బలోపేతం అయింది. అందులోనూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా పెరిగాయి. ఒక్క చాన్స్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కోరుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు రెండు సార్లు చాన్స్ ఇచ్చాం. ఒక్కసారి కాంగ్రెస్ కు ఇద్దాం.. ఏమౌతుందో చూద్దాం అన్న కోణంలో ఓటర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి మరో టెన్షన్ స్టార్ట్ అయింది. మొన్నటి వరకు కాస్తో కూస్తో ఆశ ఉండేది కానీ.. ఇప్పుడు అసలు టెన్షన్ స్టార్ట్ అయింది.

CM KCR : బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ ప్లాన్ అదుర్స్

నిజానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను బీఆర్ఎస్ అంచనా వేయలేకపోతోంది. అందుకే ఈసారి రేసులో బీఆర్ఎస్ వెనకబడుతోంది. ఎందుకంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదని.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడాలని.. అప్పుడు కాంగ్రెస్ కి గెలిచే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ భారీ వ్యూహాన్ని రచించింది. అది సక్సెస్ అయింది కూడా. ఎందుకంటే.. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అని టీటీడీపీ ప్రకటించేసింది. అందుకే తెలంగాణలో పోటీ చేయడం లేదు.

ఇక.. వైఎస్సార్టీపీ పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేయడం లేదు. నిజానికి ఆ పార్టీ పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు వస్తాయి. అందులోనూ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలుతాయి. దాని వల్ల బీఆర్ఎస్ కు లాభం అవుతుంది. కాంగ్రెస్ కు నష్టం అవుతుంది. అందుకే.. ఈసారి తాము పోటీలో లేమని వైఎస్ షర్మిల తాజాగా స్పష్టం చేసింది. తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని.. వైఎస్సార్టీపీ పార్టీ అభిమానులు, ప్రజలు అందరూ కాంగ్రెస్ కు ఓటేయాలని షర్మిల స్పష్టం చేశారు.

దీంతో బీఆర్ఎస్ లో వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒంటరి అయిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి కీలక నేతలు వెళ్లడం, పార్టీలో జోష్ కనిపించడం.. పార్టీ గెలిచే అవకాశాలు కూడా పెరగడంతో బీఆర్ఎస్ భయపడింది. ఇప్పుడు టీటీడీపీ, వైఎస్సార్టీపీ కూడా కాంగ్రెస్ కే మద్దతు తెలపడంతో సీఎం కేసీఆర్ కాస్త టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే.. తెలంగాణలో టీడీపీ అభిమానులు ఉన్నారు. వైఎస్సార్టీపీ అభిమానులూ ఉన్నారు. వీళ్లంతా తెలంగాణ వాళ్లు కాదు. కానీ.. తెలంగాణలో సెటిల్ అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు. ముఖ్యంగా ఏపీకి చెందిన వాళ్లు. ఏపీకి చెందిన వాళ్లలో టీడీపీ వాళ్లు, వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. వాళ్లు తమ ఓట్లను ఖచ్చితంగా అయితే టీడీపీ లేదా వైఎస్సార్టీపీకి వేస్తారు కానీ.. బీఆర్ఎస్ కు వేయరు. ఇప్పుడు టీడీపీ పోటీలో లేదు.. వైఎస్సార్టీపీ కూడా పోటీలో లేదు. దీంతో వాళ్లకు ఉన్న చాన్స్ కాంగ్రెస్ మాత్రమే. హైదరాబాద్ లోనే కొన్ని లక్షల మంది సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ అంతా కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. ఈ రెండు పార్టీల నిర్ణయం బీఆర్ఎస్ కు నష్టం కలిగిస్తుందా? లేక లాభం కలిగిస్తుందా? అనేది.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది