BRS : పల్లాకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఊహించని షాక్?
BRS : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మీడియా ముఖంగా అధికార పార్టీ బీఆర్ఎస్ 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. ఇంకా 4 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం సీఎం కేసీఆర్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే.. 119 నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాలకు మాత్రం టికెట్లు ఫిక్స్ అయ్యాయి. ఇంకా మిగిలింది మాత్రం 4 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో జనగామ అతి ముఖ్యమైనది.
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీటును బీఆర్ఎస్ కన్ఫమ్ చేయలేదు. అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. కానీ.. ఆయనపై భూకుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కూతురే ముత్తిరెడ్డి భూకుంభకోణాలను బయటపెట్టడంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే అది మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఆయనకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ అధిష్ఠానం జనగామ టికెట్ ను పెండింగ్ లో పెట్టింది.అయితే.. బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటి వరకు టికెట్ ఎవరికి ఇస్తారో కన్ఫమ్ చేయలేదు. జనగామలో బీఆర్ఎస్ టికెట్ ఆశించే వారిలో ముత్తిరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరొకరు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ కానీ..
BRS : టికెట్ పల్లాకా? ముత్తిరెడ్డికా?
ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. పల్లా, ముత్తిరెడ్డి ఇద్దరితోనూ పర్సనల్ గా కేటీఆర్ చర్చించారట. ఇటీవల ఎమ్మెల్సీ పల్లా అనుచరులు సీక్రెట్ గా మీటింగ్ పెట్టారు. పల్లా ఆ మీటింగ్ కు వెళ్తుండగానే మార్గమధ్యంలో ఉండగానే మంత్రి కేటీఆర్ నుంచి ఆయనకు ఫోన్ రావడంతో తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అసలు జనగామ టికెట్ ను బీఆర్ఎస్ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.