BRS MLA Yadaiah : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గురువారం జరిగాయి. ఇక అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో సీఎం, మంత్రులు, అధికారం ప్రతిపక్ష సభ్యులు కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. స్పీకర్స్ చైర్ ఔన్నత్యం, స్పీకర్ గుణగణాలు, ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావించారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు 11 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 మంది మద్దతు తెలిపారు. ఇక ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక వికారాబాద్ సీటు కోసం స్పీకర్, నేను నాలుగు సార్లు పోరాడాం. నామినేషన్ వేయడానికి నా బైక్ మీద ఇద్దరం కలిసి వెళ్ళాం. దగ్గర ఉండి నేను నామినేషన్ వేయడానికి తీసుకెళ్లాను. ఈ సందర్భంగా స్పీకర్ కు విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మేమిద్దరం అపూర్వ స్నేహితులం. పక్కపక్క మండలాలలో ఎంపీపీ గా ఉన్నాం. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కాలక్రమేణా నాకు చేవెళ్ల టికెట్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా రెండుసార్లు వికారాబాద్ వెళతావా అని అడిగారు. కానీ చేవెళ్ల కెళ్లే ఉంటానని చెప్పాను.
ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. బైక్ మీద తీసుకువెళ్లి నామినేషన్ చేయించన రఘు ప్రసాద్ కుమార్ ఇప్పుడు స్పీకర్ అయ్యారు. 2008లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నన్ను ఎన్నిక చేశారు. సభ్యులందరు పూర్వకంగా వారి హక్కులకు ఎలాంటి భంగం కలిగించకుండా దిగువ స్థాయి నుండి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ అత్యున్నత స్థానంలో ఉన్నందుకు, నన్ను ఎంపిక చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని యాదయ్య తన స్పీచ్ ను ముగించారు. ఇక మధ్యలో స్పీకర్ నీ బైక్ మీద తీసుకెళ్ళి నామినేషన్ చేయించాను, ఇప్పుడు నాకే స్పీకర్ అయితివి అన్న మాటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవ్వారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యాదయ్య మాటలకు నవ్వుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.