BRS MLA Yadaiah : అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నా బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడి పడి నవ్వారు .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BRS MLA Yadaiah : అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నా బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడి పడి నవ్వారు ..

BRS MLA Yadaiah : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గురువారం జరిగాయి. ఇక అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో సీఎం, మంత్రులు, అధికారం ప్రతిపక్ష సభ్యులు కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. స్పీకర్స్ చైర్ ఔన్నత్యం, స్పీకర్ గుణగణాలు, ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావించారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు 11 మంది ఎమ్మెల్యేలు […]

 Authored By anusha | The Telugu News | Updated on :15 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS MLA Yadaiah : అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నా బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడి పడి నవ్వారు ..

BRS MLA Yadaiah : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గురువారం జరిగాయి. ఇక అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో సీఎం, మంత్రులు, అధికారం ప్రతిపక్ష సభ్యులు కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. స్పీకర్స్ చైర్ ఔన్నత్యం, స్పీకర్ గుణగణాలు, ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావించారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు 11 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 మంది మద్దతు తెలిపారు. ఇక ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక వికారాబాద్ సీటు కోసం స్పీకర్, నేను నాలుగు సార్లు పోరాడాం. నామినేషన్ వేయడానికి నా బైక్ మీద ఇద్దరం కలిసి వెళ్ళాం. దగ్గర ఉండి నేను నామినేషన్ వేయడానికి తీసుకెళ్లాను. ఈ సందర్భంగా స్పీకర్ కు విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మేమిద్దరం అపూర్వ స్నేహితులం. పక్కపక్క మండలాలలో ఎంపీపీ గా ఉన్నాం. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కాలక్రమేణా నాకు చేవెళ్ల టికెట్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా రెండుసార్లు వికారాబాద్ వెళతావా అని అడిగారు. కానీ చేవెళ్ల కెళ్లే ఉంటానని చెప్పాను.

ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. బైక్ మీద తీసుకువెళ్లి నామినేషన్ చేయించన రఘు ప్రసాద్ కుమార్ ఇప్పుడు స్పీకర్ అయ్యారు. 2008లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నన్ను ఎన్నిక చేశారు. సభ్యులందరు పూర్వకంగా వారి హక్కులకు ఎలాంటి భంగం కలిగించకుండా దిగువ స్థాయి నుండి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ అత్యున్నత స్థానంలో ఉన్నందుకు, నన్ను ఎంపిక చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని యాదయ్య తన స్పీచ్ ను ముగించారు. ఇక మధ్యలో స్పీకర్ నీ బైక్ మీద తీసుకెళ్ళి నామినేషన్ చేయించాను, ఇప్పుడు నాకే స్పీకర్ అయితివి అన్న మాటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవ్వారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యాదయ్య మాటలకు నవ్వుకున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది