Ponnala Lakshmaiah : పొన్నాల లక్ష్మయ్యకు బీఆర్ఎస్ బిగ్ ఝలక్?
Ponnala Lakshmaiah : తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో పడని చాలామంది నేతలు పార్టీని వీడి వేరే పార్టీ వైపు చూస్తున్నారు. నిజానికి పొన్నాల లక్ష్మయ్య.. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య తాజాగా పార్టీని వీడారు. వైఎస్సార్ కేబినేట్ లో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా సేవలందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పీసీసీ చీఫ్ గానూ వ్యవహరించారు. కానీ.. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి పీసీసీ చీఫ్ అయ్యారో అప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్లకు, రేవంత్ కు పొసగడం లేదు. అలా కొందరు నేతలు బయటికొచ్చారు. తాజాగా పొన్నాల కూడా బయటికొచ్చారు.
కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లు ప్రకటించకముందే పొన్నాల పార్టీకి రాజీనామా చేశారు. తనకు ఎలాగూ జనగామ టికెట్ దక్కదని భావించి వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. పొన్నాల రాజీనామాను కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంది. మరోవైపు పొన్నాల బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాల బీఆర్ఎస్ లో చేరుతా అంటే నేను ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పొన్నాల బీఆర్ఎస్ లో చేరినా ఆయన వల్ల పార్టీలో కలిసి వచ్చేది ఏం లేదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ కే ప్లస్ అయిందని అంటున్నారు.
Ponnala Lakshmaiah : నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత
నియోజకవర్గ ప్రజల్లో పొన్నాల పట్ల వ్యతిరేకత ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే అది బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది కానీ.. అస్సలే ప్లస్ కాదని బీఆర్ఎస్ నేతలు హైకమాండ్ కు చెప్పినట్టు సమాచారం. ఆయన వెంట వచ్చే నేతలు కూడా ఎవరూ లేనందున, ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటం వల్లనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని చెబుతున్నారు. మరి.. బీఆర్ఎస్ పార్టీ ఆయన్ను చేర్చుకుంటుందా లేదా చూద్దాం మరి.