Gas Subsidy : 500లకే గ్యాస్ సిలిండర్.. ఈ సబ్సిడీ మీకు పడుతుందా…? సులభంగా ఇలా తెలుసుకోండి.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gas Subsidy : 500లకే గ్యాస్ సిలిండర్.. ఈ సబ్సిడీ మీకు పడుతుందా…? సులభంగా ఇలా తెలుసుకోండి.!!

Gas Subsidy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. దీనిలో 500 కే గ్యాస్ కూడా అమలు చేయడం జరిగింది.. చాలామంది ఖాతాలో సబ్సిడీ డబ్బులు పడ్డాయని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అందించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సహజవాయువు పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెరిగినందున భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ ధరలు బాగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Gas Subsidy : 500లకే గ్యాస్ సిలిండర్.. ఈ సబ్సిడీ మీకు పడుతుందా...? సులభంగా ఇలా తెలుసుకోండి.!!

Gas Subsidy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. దీనిలో 500 కే గ్యాస్ కూడా అమలు చేయడం జరిగింది.. చాలామంది ఖాతాలో సబ్సిడీ డబ్బులు పడ్డాయని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అందించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సహజవాయువు పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెరిగినందున భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. ఎల్పిజి ధర పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సాధారణ ప్రజలకు ఎల్పీజీ సబ్సిడీని అమలులోకి తీసుకొచ్చింది.. ఈ ఎల్పీజీ సబ్సిడీకి అర్హత పొందడానికి తప్పనిసరిగా ఎల్పీజీ ప్రొవైడర్ కు మీ ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతా మీ ఆధార్ కార్డు కనెక్షన్ చేసి ఉండాలి. అయితే మీకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఈ విధంగా జమవుతుంది.

ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్ పై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా.. ఇక రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ ధరలపై భారీ స్కీములు పెట్టిన విషయం తెలిసిందే.. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంది ఎల్పిజి గ్యాస్ వాడుతున్న వారికి 500 కి గ్యాస్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఖాతాలో పడిందో లేదో చెక్ చేసుకోవటం చాలామందికి తెలియజేయడం లేదు. బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. కానీ చాలామంది అసలు సబ్సిడీ వస్తుందా లేదా అని ఆందోళన కి గురవుతున్నారు. ఇటీవల లో ఈ పథకానికి అధికారం గా కూడా మొదలుపెట్టారు. అయితే ఈ పథకంలో నేరుగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వనున్నారని డెలివరీ సమయంలో మొత్తం డబ్బు తీసుకొని అర్హులైన వారికి 500 కంటే ఎక్కువ చెల్లించాలి. చెల్లించిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో జమ చేస్తారని తెలిపారు. అయితే ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా.. పడట్లేదా.. అనే విషయం తెలుసుకోవాలంటే..
https;//CX.Indian.in/EPICIOCL/faces/Grievance main page.jspx అని లింకు పైన క్లిక్ చేసి ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

ముందుగా ఎల్పిజి ఎంపికను ఎంచుకోవాలి. సబ్సిడీ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడి వివరాలు నమోదు చేసుకోవాలి. అప్పుడు మీకు సబ్సిడీ వివరాలన్నీ అక్కడ కనబడతాయి. చివరి ఐదు సిలిండర్ల బుకింగ్ సమాచారం కూడా అక్కడే ఉంటుంది. అంటే భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ లలో మీ గ్యాస్ ను ఎంపిక చేసుకోవాలి తర్వాత మీ సిలిండర్ బుక్ హిస్టరీ పై క్లిక్ చేయాలి. మీ సిలిండర్ కు సబ్సిడీ వచ్చిందా లేదా వివరాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒక నెలకు సబ్సిడీ వస్తే మీ పేరు నమోదు చేసి ఉన్నట్టు.. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 55కి కాల్ చేసి ఫిర్యాదు చేయగలరు.. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్సిడీ డబ్బు మీ ఖాతాలో పడుతుందా లేదా అనేది సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మొదటగా అధికారి వెబ్సైట్ కి www.mylpg.in కి వెళ్ళాలి. దీంట్లో లాగిన్ అనే ఆప్షన్, లాగిన్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత ఓపెన్ చేసి వెబ్సైట్ లో టాప్ లో గ్యాస్ చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మీ గ్యాస్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది