CM Breakfast Scheme : తెలంగాణ విద్యార్థులకు దసరా కానుక.. ఇక నుంచి స్కూళ్లలో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్.. ఏం పెట్టనున్నారో తెలుసా?
CM Breakfast Scheme : తెలంగాణ విద్యార్థులకు దసరా కానుకను అందించనుంది ప్రభుత్వం. దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో సరికొత్త స్కీమ్ ను తీసుకురానుంది. ఈనెల 24 నుంచి సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కానుంది. ప్రతి రోజ ఉదయం 9.30 నుంచి అల్పాహారం ప్రారంభించనున్నారు.

#image_title
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని ఉన్న 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ ద్వారా టిఫిన్ అందించనున్నారు. ఇక నుంచి విద్యార్థులు ఉదయం కూడా ఇంట్లో టిఫిన్ చేసి రావాల్సిన అవసరం లేదు. స్కూల్ లోనే టిఫిన్, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు.
CM Breakfast Scheme : వారం రోజుల మెనూ ఇదే
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల టిఫిన్స్ విద్యార్థుల కోసం అందించనున్నారు. అందులో భాగంగా సోమవారం నాడు గోధుమ రవ్వ ఉప్మా, చట్నీని అందిస్తారు. మంగళవారం బియ్యం రవ్వతో కిచిడి చేయనున్నారు. చట్నీ కూడా అందిస్తారు. బుధవారం నాడు బొంబాయి రవ్వతో ఉప్మా, సాంబార్ ఇస్తారు. గురువారం నాడు రవ్వ పొంగల్, సాంబార్ అందిస్తారు. శుక్రవారం నాడు మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్ అందిస్తారు. శనివారం నాడు గోధుమ రవ్వ కిచిడి, సాంబార్ అందిస్తారు.