CM KCR : కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత క్యాబినెట్‌లో మార్పులు..?

Authored By Himanshi | The Telugu News | Updated on: March 14, 2021, 1:10 pm

CM KCR : తెలంగాణలో బీజేపీ మెల్ల మెల్లగా చాప కింద నీరు మాదిరిగా పెరిగి పోతుంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలం అవుతున్నారు. పార్టీలో కొందరు మినహా ఎక్కువ శాతం మంది బీజేపీ పై విమర్శలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు భయంతో కూడా వ్యాఖ్యలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఎక్కడ తమ అవినీతిని బయట పెట్టే విధంగా ఐటీ రైట్స్ ను చేస్తారేమో అనే భయంతో కొందరు నోరు మెదపడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు మంత్రులు ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారు. పార్టీకి నష్టం జరుగుతున్నా నోరు విప్పని మంత్రులకు ఉద్వాసన పలికేందుకు గాను కేసీఆర్‌ సంచలన నిర్ణయానికి సిద్దం అవుతున్నారు.

కేసీఆర్  ప్రస్తుత క్యాబినేట్ నుండి అయిదు నుండి ఎనిమిది మందిని తొలగించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున జరుగబోతున్న ఈ మార్పుతో తెలంగాణ రాజకీయం పూర్తిగా మారబోతుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలంను ఆదిలోనే తుంచి పారేసేందుకు కేసీఆర్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి వర్గ కూర్పును ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులుగా ఉన్న వారు బీజేపీ పై వ్యాఖ్యలు చేయడం వల్ల మీడియాలో కవరేజ్ ఎక్కువగా వస్తుంది. తద్వారా బీజేపీ కి నష్టం తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే బీజేపీని ఏకి పారేసే ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

KCR

KCR

కాంగ్రెస్ నుండి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరియు ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి కూడా కొత్త గా మంత్రి పదవులు చేపట్టబోతున్న వారిలో ఉన్నారు. ఇక తన కూతురు కవిత కు కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ ఫలితాల ఆధారంగా కూడా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఏ మంత్రి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా ప్రభావం చూపించలేక పోయారో వారు కూడా ఉద్వాసనకు గురి కాక తప్పదు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో వారం పది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Himanshi

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp