Revanth Reddy : కమ్మ అంటేనే కష్టపడే గుణం… కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కమ్మ అంటేనే కష్టపడే గుణం… కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,4:39 pm

ప్రధానాంశాలు:

  •  విశ్వనగర నిర్మాణంలో అందరూ భాగం కావాలి

  •  Revanth Reddy : కమ్మ అంటేనే కష్టపడే గుణం... కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఇందులో ఎవరి పట్లా వివక్ష చూపబోదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో ఎవరి పట్ల వివక్ష ఉండదని, అది ప్రజా ప్రభుత్వ విధానం కూడా కాదని సీఎం అన్నారు.

అన్ని కులాల పట్ల అపారమైన గౌరవం ఉందని, కమ్మ ప్రతినిధుల నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి కష్టానికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి నాయకత్వం లేని లోటు స్పష్టంగా కనబడుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావుగారు, ఎన్టీఆర్ గారు, జైపాల్ రెడ్డిగారు, వెంకయ్య నాయుడుగారి లాంటి నాయకుల ప్రభావం ఢిల్లీలో స్పష్టంగా కనిపించేదని గుర్తు చేశారు.

Revanth Reddy కమ్మ అంటేనే కష్టపడే గుణం కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : కమ్మ అంటేనే కష్టపడే గుణం… కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి..!

జాతీయ స్థాయిలో తెలుగు వారు రాణించే విషయంలో కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కమ్మ సంఘం కోసం వివాదంలో ఉన్న 5 ఎకరాల భూ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది