Cm Revanth Reddy : ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేసీఆర్.. మాజీ ముఖ్యమంత్రికి సన్మాన చేయనున్న సీఎం
Cm Revanth Reddy : మొన్నటివరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇప్పుడు ఒకే వేదికపై రాబోతున్నారట.ఈ విషయం తెలిసి అందరు అవాక్కవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు పూర్తవుతుండటంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఈ ఏడాది పదో రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం కావడంతో ఈ వేడుకలని భారీ ఎత్తున జరిపించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. ఈ అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వహించాలని ప్లాన్స్ చేస్తున్నారట.
Cm Revanth Reddy : కేసీఆర్‌కి రేవంత్ సన్మానం
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందట. అలానే తెలంగాణ కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. ఉద్యమాలు చేశారు. అయితే ప్రధాన ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడంతో ఆయనని కూడా ఆ రోజు ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందట. ఇందుకు సంబంధించి ఆహ్వానం కూడా పంపినట్టు తెలుస్తుంది. అలానే ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4 న కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రివర్గం సూచించడంతో దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. అయితే రేవంత్ ఆహ్వానం మేరకు కేసీఆర్ ఆ కార్యక్రమానికి వస్తారా, అక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ల పలకరింపులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.