CM Revanth Reddy : మూసీ సుందరీకరణ.. హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చి దిద్ద‌డ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం.. సీఎం రేవంత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : మూసీ సుందరీకరణ.. హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చి దిద్ద‌డ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం.. సీఎం రేవంత్

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,5:15 pm

ప్రధానాంశాలు:

  •  మూసీ ప్రక్షాళనతో విశ్వనగరానికి మరింత శోభ

  •  హైడ్రా ద్వారా సమస్యల సత్వర పరిష్కారం

  •  గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి

CM Revanth Reddy  : మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా (HYDRAA) అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు.

CM Revanth Reddy మూసీ సుందరీకరణ హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చి దిద్ద‌డ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం సీఎం రేవంత్

CM Revanth Reddy : మూసీ సుందరీకరణ.. హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చి దిద్ద‌డ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం.. సీఎం రేవంత్

రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది