CM Revanth Reddy : ఉన్నది ఆరు బెర్త్ లే .. 20 మందిలో మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ..? రేవంత్ రెడ్డికి అవస్థలేనా.. ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : ఉన్నది ఆరు బెర్త్ లే .. 20 మందిలో మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ..? రేవంత్ రెడ్డికి అవస్థలేనా.. ??

 Authored By anusha | The Telugu News | Updated on :16 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : ఉన్నది ఆరు బెర్త్ లే .. 20 మందిలో మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ..? రేవంత్ రెడ్డికి అవస్థలేనా.. ??

CM Revanth Reddy  : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆరేయబోతున్నారు అంటే మిగిలిన 6 క్యాబినెట్ల బెర్త్ లు ఎప్పుడు భర్తి చేయబోతున్నారు. తొందరపడుతున్న ఆశా బాహులకు రేవంత్ రెడ్డి ఎలాంటి తీపి కబురు అందించబోతున్నారు అని అంతా అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అధికార పీఠంపై ఉన్న వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారంటే పొరపాటే. వారికి మూడు పూటల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ కొన్నింటిని తెలివిగా వాయిదా వేస్తూ పాలన సాగించాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ కూడా అదే పని చేయాలి. కొంతవరకు ఆయన ఆ బాటలో నడుస్తున్నారు అనుకోవాలి. కాకపోతే అనివార్యంగా పరిష్కరించాల్సిన సమస్యలు తీర్చాల్సిన కోరికలు కొన్ని ఉండనే ఉన్నాయి. అందులో మంత్రి వర్గ విస్తరణ కూడా ఒకటి అని చెప్పాలి. రేవంత్ తో కలిసి 12 మంది మంత్రులు తొలుత ప్రమాణ స్వీకారం చేయగా ఇప్పుడు మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.

దానికోసం కనీసం 20 మందికి పైగా కాచుకు కూర్చున్నారు. ఆరుగురికి పదవి ఇస్తే మిగతా వారికి కోపం తెప్పించినట్లు అవుతుంది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అందరినీ ఎలా సంతృప్తి పరచాలి ఆలోచిస్తూ తన అంతరంగీకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలు ఈసారి సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకోవాల్సిన అనివార్యత ఉంది. ఇప్పుడు క్యాబినెట్లో ఒక ముస్లిం నేత కూడా లేరు. అదేవిధంగా ఎన్నికల సమయంలో త్యాగం చేసిన వాళ్ళను కూడా ఒకరిద్దరిని మంత్రివర్గంలో చేర్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వారిలో ఎంతమందికి ఇవ్వాలో రేవంత్ ఆలోచిస్తున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయిన వారిని క్యాబినెట్ బెర్త్ ఇవ్వవచ్చా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశం పైన షబీర్ అలీని ప్రమాణ స్వీకారం చేయించలేకపోయారు. ఇలాంటి రూల్స్ పక్కన పెట్టి మంత్రి పదవిని ఇవ్వాలని వారికి మండలి సభ్యత్వం ఇవ్వాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముస్లిం కోటాలో షబ్బీర్ అలీ, మహమ్మద్ హజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి. మహమ్మద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఓడిపోయారు. ఒక ముస్లిం కి అవకాశం ఇస్తారా లేక ఇద్దరిని చేర్చుకుంటారా అని చూడాల్సి ఉంది. జిహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది.

మళ్లీ నిలబడాలంటే అక్కడ ఒకరిద్దరు నేతలకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మధు గౌడ్, మాజీ మంత్రి అంజన్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేవారు అని తదేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లకి రాహుల్ గాంధీ సన్నిహితులు అని కూడా పేరు ఉంది. సంగారెడ్డిలో ఓడిపోయిన జంగారెడ్డి కూడా ఎమ్మెల్సీ అడుగుతున్నారు. గెలిచినవారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఆయన సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంచిర్యాల ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఇలా చాలామంది మంత్రి పదవిని అడుగుతున్నారు. ఉన్నది ఆరు బెర్త్ లే అయినా ఆశా బాహులు చాలామంది ఉన్నారు. వీరిలో మంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలో రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది