Rahul Gandhi : రాహుల్ ఖమ్మం జన గర్జన సభ మీద దీ తెలుగు న్యూస్ విశ్లేషణ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rahul Gandhi : రాహుల్ ఖమ్మం జన గర్జన సభ మీద దీ తెలుగు న్యూస్ విశ్లేషణ !

Rahul Gandhi : ఇది కదా అసలైన ఊపు అంటే. ఖమ్మం నగరం మొత్తం కాంగ్రెస్ నాయకులతో నిండిపోయింది. అసలు జనాలు వస్తారా రారా అని అంతా టెన్షన్ పడ్డారు కానీ.. అనుకున్నదానికంటే ఎక్కువగా లక్షలాది మంది జనం కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభకు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులంతా ఏకతాటి మీదికి వచ్చారు. సీనియర్లు మొత్తం ఒకే వేదిక మీద కనిపించారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ.. వార్తలు వచ్చిన ఉత్తమ్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :3 July 2023,7:00 pm

Rahul Gandhi : ఇది కదా అసలైన ఊపు అంటే. ఖమ్మం నగరం మొత్తం కాంగ్రెస్ నాయకులతో నిండిపోయింది. అసలు జనాలు వస్తారా రారా అని అంతా టెన్షన్ పడ్డారు కానీ.. అనుకున్నదానికంటే ఎక్కువగా లక్షలాది మంది జనం కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభకు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులంతా ఏకతాటి మీదికి వచ్చారు. సీనియర్లు మొత్తం ఒకే వేదిక మీద కనిపించారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ.. వార్తలు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వేదిక మీద కనిపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి.. ఇలా సీనియర్ నాయకులంతా ఒకే వేదిక మీద ఉండటం, అది కూడా రాహుల్ గాంధీ పక్కన నిలబడటం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది.

నిజానికి కాంగ్రెస్ గర్జన సభను విజయవంతం చేయడం కోసం కాంగ్రెస్ నాయకులంతా చాలా కష్టపడ్డారు. ఈ సభను అట్టర్ ఫ్లాప్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా అష్టకష్టాలు పడింది. ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ఆపడం, ప్రైవేటు వాహనాలను ఆపడం, గ్రామాల నుంచి ప్రజలు వెళ్లకుండా అడ్డుకోవడం చాలానే మీడియాలో చూపించారు. కానీ.. గత తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ రేంజ్ లో మీటింగ్ ఎప్పుడూ పెట్టలేదు. ఈ రేంజ్ జనం కూడా ఎప్పుడూ రాలేదు. నిజానికి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సభను ఒక చాలెంజింగ్ గా తీసుకొని సభను నిర్వహించారు. అందుకే జనం కూడా భారీగా తరలివచ్చారు.ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే సరైన సఖ్యత లేదు అని మరోసారి రాహుల్ గాంధీ సమక్షంలోనే ఖమ్మం సభలో స్పష్టమైంది. తన పాదయాత్ర ముగింపు సందర్భంగానే ఈ సభను నిర్వహించాలని అనుకున్నారు భట్టి విక్రమార్క.

congress jana garjana sabha in khammam rahul gandhi attended

congress jana garjana sabha in khammam rahul gandhi attended

Rahul Gandhi : రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించని భట్టి విక్రమార్క

దానికి తోడు పొంగులేటి కూడా పార్టీలో చేరడం ప్లస్ అయింది. అయితే.. ఈ సభలో మాట్లాడిన భట్టి.. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పేరు ప్రస్తావించారు కానీ.. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు. దీంతో మరోసారి వీళ్ల మధ్య ఉన్న వివాదం తెర మీదికి వచ్చింది. అంటే.. వీళ్లంతా పైకి తామంతా ఒకటే అన్నట్టుగా కనిపిస్తున్నారు కానీ.. లోపల మాత్రం వీళ్ల మధ్య వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వీడకపోతే అది వచ్చే ఎన్నికల్లో చాలా ఇబ్బందులను తీసుకొచ్చే అవకాశం ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది