Telangana Congress : కేసీఆర్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్ చేతుల్లో 40 శాతం ఓటు బ్యాంక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Congress : కేసీఆర్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్ చేతుల్లో 40 శాతం ఓటు బ్యాంక్

 Authored By kranthi | The Telugu News | Updated on :16 September 2023,2:00 pm

Telangana Congress : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకో రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి మూడో సారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి మరో చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఎందుకంటే.. ఇటీవలే కర్ణాటకలో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటగా.. అదే ఊపుతో తెలంగాణలోనూ పని చేయాలని భావిస్తోంది.

కర్ణాటకలో గెలిచి సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ గెలవాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలే వీస్తున్నాయి. నిజానికి.. మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని అంతా భావించారు. కానీ.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు మూడో ప్లేస్ కు వెళ్లిపోయింది.అయితే తాజా సర్వే ప్రకారం షాకింగ్ నిజాలు తెలంగాణలో బయటపడ్డాయి. త్వరలో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో షాకింగ్ సర్వే ఏం వెల్లడించిందంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు భారీగా పెరిగిందట. అది కూడా బీఆర్ఎస్ కు సమానంగా.

congress vote bank increased in telangana

congress vote bank increased in telangana

Telangana Congress : బీఆర్ఎస్ కు దీటుగా ఓటు బ్యాంకు పెంచుకున్న కాంగ్రెస్

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉండగా, కాంగ్రెస్ చేతుల్లో కూడా 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు 20 శాతం ఓటు బ్యాంకుతో ఉన్నాయి. అంటే.. బీఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో గట్టిగానే పోటీ పడనుందని తెలుస్తోంది. కొంచెం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది