Dil Raju : డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ గా మొదలు పెట్టిన దిల్ రాజు నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ ఈక్వేషన్స్ అనుకూలించకపోవడంతో అది జరగలేదు. కానీ ఇప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించడం, సినీ వర్గాలతో పాటు రాజకీయా వర్గాల్లో సైతం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్ని చిత్రాలు కూడా నిర్మిస్తూ అనేకమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్నానని ఇటీవలే ప్రకటించారు. దీనికోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయనున్నారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వ సంబంధాల వారధిగా చురుకుగా వ్యవహరిస్తూ తనపై ప్రభుత్వం నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మారడంతో, ఆయన ప్రభుత్వానికి మరింత దగ్గరగ సినిమా పరిశ్రమను తీసుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రిను కలవబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం అభినందనల వరకే పరిమితం అవుతుందా.? లేక సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందా.? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
This website uses cookies.