Revanth Reddy : రేవంత్ రెడ్డినా, మజాకానా… దెబ్బకి టాలీవుడ్ పెద్దలు కదిలొచ్చారుగా..!
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినీ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు టాలీవుడ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీఎం…. డ్రగ్స్ నియంత్రణలో సహకరించాలని సినీ పరిశ్రమను కోరారు. ఈ సందర్భంలోనే తనదైన మాట తీరుతో ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటించారు సీఎం. ఎన్నడూ లేనట్లు సీఎం వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లు సీఎం కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అసలు ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారన్న సమాచారం సేకరించే పనిలో పడ్డారు ఇండస్ట్రీ పెద్దలు.
Revanth Reddy ఏం జరుగుతుంది..
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంతమంది సినీ పెద్దలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమను ఏపీకి తరలిస్తారనే చర్చలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను సన్మానించేందుకు అనుమతి కోరారట… ఈ విషయం తెలిసిన రేవంత్‌రెడ్డి ఆగ్రహించారంటున్నారు. సినీ పరిశ్రమ ఏపీకి తరలితే తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించిన సీఎం… ఇండస్ట్రీ పెద్దలకు ఓ ఝర్క్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేశారా? అని అనుమానిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి షరతుపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) స్పందించింది. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శులు దామోదర ప్రసాద్, కే శివప్రసాదరావు వెల్లడించారు.
ఈ మేరకు వారు పత్రికా ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సానుకూలంగా స్పందించారని గుర్తు చేసుకున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినీ రంగ ప్రముఖులు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమ వంతుగా కృషి చేయాల్సిందే అన్నారు. ఇలాంటి అంశాల్లో చిత్ర పరిశ్రమ గతంలోనూ ముందుండి నడిపించిందని తెలిపారు. పరిశ్రమకు చెందిన వారంతా డ్రగ్స్, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో సీఎంను కలుస్తామని తెలిపారు