New Ration Cards : తెలంగాణలో పేద, మధ్య తరగతి ఆశావాహులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ
ప్రధానాంశాలు:
New Ration Cards : తెలంగాణలో పేద, మధ్య తరగతి ఆశావాహులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ
New Ration Cards : తెలంగాణలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్ని పథకాలకు రేషన్ కార్డు ration cards లింక్ తప్పనిసరి కావడంతో అంతా కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ cm revanth reddy సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం సిద్ధమౌతుంది. విధివిధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని సివిల్ సప్లయ్ civil supplies డిపార్ట్‌మెంట్ రెండు రోజుల్లో ప్రకటించనుంది. కాగా దరఖాస్తులు ఈ నెల 15 నుంచి స్వీకరించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు… చేర్పులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయనున్నట్లు తెలిసింది.
New Ration Cards : ఈ నెల 26 నుంచి కొత్త కార్డులు జారీ..
ఇక కొత్త రేషన్‌కార్డుల new ration cards కోసం ఇప్పటివరకు అర్హులు ఆన్‌లైన్‌లో మీ-సేవలో దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే అఫ్లికేషన్లు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు, నగరాల్లో బస్తీ సభలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని డిజిటలైజేషన్ చేసి.. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా అర్హులకు ఈనెల 26 నుంచి కొత్త కార్డుల జారీప్రక్రియను ప్రారంభించనున్నారు.
New Ration Cards : రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం కల్పిస్తే మరో 10 నుంచి 12 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటివి 10 నుంచి 12 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను కూడా ప్రభుత్వం క్లియర్ చేయనుంది.