New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. ఆ జిల్లా నుంచి మొదలు..!
ప్రధానాంశాలు:
ఒకేసారి 2 లక్షల కొత్త రేషన్ కార్డు లను పంపిణి చేయబోతున్న రేవంత్ సర్కార్
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సీఎం స్వయంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్డు కోసం దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారికి ఈ అవకాశం లభించనుంది.

New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. ఆ జిల్లా నుంచి మొదలు..!
New Ration Cards హరీష్ రావు అడ్డాలో కొత్త రేషన్ కార్డుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం ఈ దశలో 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతుంది. దీనివల్ల పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సబ్సిడీ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. గతంలో వివిధ కారణాల వల్ల కార్డు పొందలేకపోయిన కుటుంబాలు ఇప్పుడు అధికారికంగా లబ్ధిదారులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నియమితమైన అధికారులు అర్హులైన వారికి కార్డులను అందించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతుంది. కొత్తగా కార్డులు పొందిన వారికి అన్నపూర్ణ, ఫెయిర్‌ప్రైస్ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యం, షుగర్, కిరాణా వస్తువులు తక్కువ ధరకు అందించనున్నారు. ఇదే సమయంలో, పాత కార్డుల రివ్యూకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో, అపరాధ చరిత్ర ఉన్నవారు లేదా అనర్హులు కార్డులను కోల్పోయే అవకాశం ఉంది. మొత్తంగా ఈ చర్యలు లబ్దిదారుల హక్కులను కాపాడే దిశగా ముందడుగు కావచ్చు.