Pawan Kalyan – KTR : పవన్ కళ్యాణ్ – KTR ల మధ్య అన్నదమ్ముల కథ నడిచిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan – KTR : పవన్ కళ్యాణ్ – KTR ల మధ్య అన్నదమ్ముల కథ నడిచిందా?

 Authored By kranthi | The Telugu News | Updated on :30 June 2023,9:00 pm

Pawan Kalyan – KTR : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ ఎక్కడ కలిసినా బాగానే పలకరించుకుంటారు. అది కూడా అన్నదమ్ముల లాంటి బంధం ఉంది ఇద్దరి మధ్య. తాజాగా పవన్ కళ్యాణ్ పై కేటీఆర్ విభిన్నమైన కామెంట్స్ చేశారు. వాళ్ల మధ్య అన్నదమ్ముల లాంటి బంధం ఉందని అందరూ అనుకోవడం తప్ప ఇద్దరూ ఎప్పుడూ నోరు విప్పి చెప్పలేదు. కానీ.. తాజాగా పవన కళ్యాణ్ గురించి మంత్రి కేటీఆర్ చెప్పడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అలజడి సృష్టించింది.

పవన్ కళ్యాణ్ నాకు అన్నలాంటి వాడు. మా మధ్య మంచి రిలేషన్ షిప్ కొనసాగుతోంది. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం. నాకు కూడా సాహిత్యం అంటే ఆసక్తి.. అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అసలు రాజకీయాల పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ దారి వేరు.. కేటీఆర్ దారి వేరు. కానీ.. వీళ్లిద్దరి మధ్య అంత బాండ్ ఎలా ఏర్పడింది అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్.. పవన్ పై ఆ వ్యాఖ్యలు చేశారు. తమ అభిరుచులు దగ్గరగా ఉండటం మూలాన తమ మధ్య ఒక అన్నదమ్ముల బంధం ఏర్పడింది అన్న కోణంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇద్దరూ చాలా సార్లు కలుసుకున్నారట.

do you know the story of brothers between pawan kalyan and ktr

do you know the story of brothers between pawan kalyan and ktr

Pawan Kalyan – KTR : కేటీఆర్ ఇంటర్వ్యూ వైరల్

ఇద్దరూ చాలాసేపు పలు విషయాల మీద మాట్లాడుకున్నారట. కానీ.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి తెలంగాణలోని పవన్ కళ్యాణ్ అభిమానులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు మంత్రి కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు వాదిస్తున్నా.. తమ అభిమాన నటుడిని, రాజకీయ నాయకుడిని కేటీఆర్.. అన్న అని పిలవడంతో జనసైనికులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది