Congress 6 Guarranties : ప్రజా పాలన దరఖాస్తులపై ప్రజల్లో సందేహాలు .. వీటిపై స్పష్టత ఇచ్చేది ఎవరు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress 6 Guarranties : ప్రజా పాలన దరఖాస్తులపై ప్రజల్లో సందేహాలు .. వీటిపై స్పష్టత ఇచ్చేది ఎవరు..?

 Authored By anusha | The Telugu News | Updated on :29 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Congress 6 guarranties : ప్రజా పాలన దరఖాస్తులపై ప్రజల్లో సందేహాలు .. వీటిపై స్పష్టత ఇచ్చేది ఎవరు..?

  •  6 గ్యారంటీల పథకాల దరఖాస్తులపై ప్రజల్లో సందేహాలు.. వీటిని తీర్చేది ఎవరు..?

  •  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది

Congress 6 guarranties : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. మొదటి రోజు నిర్వహించిన సభలకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా వివిధ పథకాలతో పాటు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రజల్లో ఈ పథకాల దరఖాస్తులపై అనేక సందేహాలు ఏర్పడ్డాయి. ఏ ఏ పథకాలకు తాము అర్హులం..?ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలా..?ఆధార్ కార్డు కుటుంబంలో అందరికీ లేదు..పథకాలు రావా..? ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు..దరఖాస్తు చేసుకోవచ్చా..? ఇలా అనేక సందేహాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఈ సందేహాలను తీర్చేందుకు అధికారులు విఫలమవుతున్నారు. రేషన్ కార్డ్ తప్పనిసరి అని చెబుతూనే మరోవైపు రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో గందరగోళం నెలకుంది.

ఇక దరఖాస్తులో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ రాయాలని చెబుతున్నారు. కానీ చాలామంది అడ్రస్ లో ప్రస్తుతం ఉండడం లేదు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా అనేక సందేహాలతో మొదటి రోజు దరఖాస్తుల స్వీకరణ గందరగోళంగా, అయోమయంగా మారింది. గురువారం రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామని, అందులోని అడ్రస్ నే దరఖాస్తులో రాయాలని అధికారులు సూచించారు. అయినా కూడా ప్రజలలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి ఏంటంటే..

* ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లో ప్రస్తుతం ఉండని వారి పరిస్థితి ఏంటి..?
* రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకాలు వర్తిస్తాయా..?
* సొంత భూమి ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందుతుందా..?
* అద్దె ఇళ్లలో ఉంటున్నవారు గృహజ్యోతి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?* రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు..?
* ఉమ్మడి కుటుంబాలు ఎన్ని దరఖాస్తులు సమర్పించాలి..?
* ఇప్పటికే రైతుబంధు, ఆసరా పింఛన్, పొందుతున్న వారు మళ్ళి దరఖాస్తు చేసుకోవాలా..?
* తెల్ల రేషన్ కార్డుకు ఎవరు అర్హులు..?గ్రామీణుల ఆదాయం ఎంత ఉండాలి..?పట్టణవాసుల ఆదాయం ఎంత ఉండాలి..?
ఇలా అనేక సందేహాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తం అవుతున్నాయి. కానీ వీటిపై అధికారు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వీటన్నిటిపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది