CM Revanth Reddy : డిగ్రీ లేకున్నా కూడా సిరాజ్‌కి గ్రూప్ 1 ఉద్యోగం.. రేవంత్ రెడ్డి ప్రకటన
CM Revanth Reddy : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన తెలంగాణ మంత్రి మండలి.. పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్.. నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్‌లకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్ 1 ఉద్యోగంతోపాటు నగదు ప్రోత్సాహం కూడా అందించనున్నారు. ఇవే కాకుండా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో మహ్మద్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు.
CM Revanth Reddy : గ్రూప్ 1 ఉద్యోగం..
హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తాను సాధించిన మెడల్ ని చూపించడమే కాకుండా.. సీఎంకు తన జెర్సీని కూడా బహూకరించాడు. ఆ సమయంలోనే సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. అలాగే నిఖత్ జరీన్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. వీరు ఇరువురికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్నారు. అయితే ఇద్దరూ అథ్లెట్లు కాబట్టి దాదాపుగా.. గ్రూప్ 1 కేడర్ లో డీఎస్పీ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంక కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మాట తప్పిందని రేవంత్ రెడ్డి మాట తప్పారు. సిరాజ్, జరీన్‌కు గ్రూప్-1 కేడర్‌లో డీఎస్పీ ఉద్యోగంతో పాటు నగదును కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అందించనున్నట్లు సమాచారం. బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా గత ఏడాది డిసెంబర్లో రూ.2 కోట్ల చెక్‌ను అందించారు. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడానికి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని అందించారు. గత ఏడాది మే నెలలోనే అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేయగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్కును అందించారు. సిరాజ్‌కి విద్యార్హత లేకపోయిన కూడా గ్రూప్ 1 జాబ్ ఇస్తున్నాం. క్రీడాకారులకి తోడ్పాటునందిస్తున్నాం అనడానికి ఇదే నిదర్శనం. త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తాం అని రేవంత్ అన్నారు.