Fake Baba : దొంగ బాబా బాగోతం బట్టబయలు.. మత్తు నీళ్లు ఇచ్చి మహిళలపై అత్యాచారం..!
ప్రధానాంశాలు:
Fake Baba : దొంగ బాబా బాగోతం బట్టబయలు.. మత్తు నీళ్లు ఇచ్చి మహిళలపై అత్యాచారం..!
Fake Baba : దేశంలో దొంగ బాబాలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మాయలు, మంత్రాలతో సమస్యలు తొలగిస్తామని చెప్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. లక్షలకు లక్షలు డబ్బులు దోచేయడమే కాకుండా మహిళల మానాలూ తీస్తున్నారు తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.మెదక్ జిల్లాలో ఫేక్ బాబా అలియాస్ బొమ్మెల బాపుస్వామి అరెస్ట్ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Fake Baba : దొంగ బాబా బాగోతం బట్టబయలు.. మత్తు నీళ్లు ఇచ్చి మహిళలపై అత్యాచారం..!
Fake Baba దొంగ బాబా మాములోడు కాదు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి తనకు తానుగా శివస్వామి అంటూ మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. ఇంట్లో ఏవైనా సమస్యలుంటే చిటికెలో తీర్చేస్తానని మహిళలకు నమ్మబలుకుతాడు. అతడి మాటలు నమ్మి మహిళలు పూజలకు సిద్దమయ్యాక.. తనలో కామాంధుడి రూపాన్ని బయటకు తీస్తాడు ఈ ఫేక్ బాబా.
నిమ్మకాయలో మత్తుమందు, నీళ్ళల్లో నిద్రమాత్రలు వేసి మహిళలకు తాగిస్తాడు. మహిళలు ఆ నీళ్లు తాగాక స్పృహ కోల్పోయక వారిని అత్యాచారం చేసి వీడియో తీస్తాడు. తర్వాత కొన్ని రోజులకు మహిళలకు ఆ వీడియోలు పంపించి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియో కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరింపులుకు పాల్పడుతాడు.