Thief Baba : దొంగ బాబా అరాచకం.. నాలుగేండ్లుగా అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం..!
Thief Baba : దొంగ బాబాల అరాచకాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. కానీ చాలా మంది అలాంటి బాబాలకు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో తాజాగా చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సదురు బాబాతో పాటు అతని కొడుకు సైతం వీరిపై లైంగికదాడి చేయడం సంచలనంగా మారింది.తమ తల్లి ఆరోగ్యం బాగోలేదని వచ్చిన మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన దొంగబాబా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. హైదరాబాద్ పాతబస్తీలో కిషన్‌బాగ్‌కు చెందిన ఓ మహిళ అనారోగ్యానికి గురైంది.
దీంతో 2005 లో చాంద్రాయణగుట్టలో ఉంటున్న ఓ భూత వైద్యుడు సయ్యద్ హసన్ వద్దకు ఆమెను ఆమె కూతుర్లు తీసుకొచ్చారు. ఆమెకు తాయత్తులతో వైద్యం చేస్తున్నట్టు ఆ బాబా వారిని నమ్మించాడు. ఇక తల్లికి ఆరోగ్యం బాగుపడటంతో వారు ఆ బాబాను నమ్మారు. ఎప్పుడు అనారోగ్యం పాలైన ఆయన దగ్గరకే వచ్చేవారు. అయితే సదురు మహిళకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్ద కూతురుకు పెళ్లి అయింది. కానీ ఫ్యామిలీ గొడవలు, ఆరోగ్య సమస్యల వల్ల ఎదురవడంతో బాబాను ఆశ్రయించింది. దీంతో భర్తే క్షద్రపూజలు చేయించి ఇలా ఆమె ఇలా అయ్యేందుకు కారణమయ్యాడని వారిని నమ్మించాడు.

thief baba is anarchy
Thief Baba : వైద్యం పేరుతో లైంగిక దాడి..
వైద్యం కోసం తన వద్దకు వచ్చి ఆమెపై ఆ దొంగబాబా లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలుగా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఆ మహిళలు నివసిస్తున్న ఇట్లు వారికి కలిసి రావడంలేదంటూ దానిని అమ్మి, ఆ డబ్బులు దక్కించుకున్నాడు. అక్కకి తోడుగా వస్తున్న చెల్లెలిపై సైతం అతడి కన్ను పడింది. క్షుద్రపూజల పేరుతో ఆమెపై సైతం లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇదే అదునుగా భావించిన ఆ దొంగబాబా కొడుకు సయ్యద్ అఫ్రోజ్ కూడా సదురు మహిళ చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడి హింసను భరించలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ తతంగమంతా బయటపడింది. దీంతో చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దొంగబాబా, అతని కొడుకును అరెస్టు చేశారు. ఇలాంటి బాబాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.