Rythu Bharosa : ఈసారైనా రైతు భరోసా జమ చేస్తారా..? సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్న రైతులు
ప్రధానాంశాలు:
Rythu Bharosa : ఈసారైనా రైతు భరోసా జమ చేస్తారా..? సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్న రైతులు
Rythu Bharosa : తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో మేలు చేసే పథకం ‘రైతు భరోసా’. గతంలో ఈ పథకం ‘రైతు బంధు’ పేరుతో అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని రైతు భరోసా పేరుతో కొనసాగిస్తోంది. కానీ మారినది కేవలం పేరు మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బులు నిజంగా దున్నే రైతుకు పడుతున్నాయా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చాలా మంది అసలైన రైతులు మాత్రం తమ ఖాతాల్లో రూపాయి కూడా పడలేదని వాపోతున్నారు.

Rythu Bharosa : ఈసారైనా రైతు భరోసా జమ చేస్తారా..? సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్న రైతులు
Rythu Bharosa : సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్న రైతులు
ఈ పథకం అందాల్సిన అసలైన రైతులు సొంతంగా భూమిలో సాగు చేస్తున్నా, అప్పటి నుండి ఇప్పటిదాకా వారికి ప్రభుత్వం నిధులు జమ చేయలేదు. ఎందుకంటే భూమి పట్టాలు వేరొకరి పేరుపై ఉన్నాయి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామ స్థాయిలో వ్యవసాయం చేస్తున్న రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు, రైతు నేస్తం కార్యక్రమాలు కూడా పెద్దగా ప్రయోజనం కలిగించలేదని రైతులు అంటున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూ సర్వే చేపట్టి, అసలైన దున్నే రైతుల వివరాలను నమోదు చేయాలి. లేకుంటే మళ్లీ వచ్చే ‘రైతు భరోసా’ కూడా కేవలం నామమాత్రంగా మారిపోతుందని, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకే న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో రైతుల సమస్యలు తీర్చకుండా మెజారిటీ ఆశించడం సాధ్యపడదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి రేవంత్ సర్కార్ ఏంచేస్తుందో చూడాలి.