KCR : కేసీఆర్ కి మరో భారీ దెబ్బ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ కి మరో భారీ దెబ్బ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :4 September 2023,9:00 pm

KCR : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. మరి కొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ విజయం సాధించడం తెలిసిందే. అయితే మరి కొద్ది నెలల్లో జరగబోతున్న మూడో ఎన్నికలలో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ముందుగానే ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పోటి విషయంలో చాలామంది సిట్టింగ్ లకే అవకాశం కల్పిస్తూ..

మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ చేసిన ఈ పని ఆయన కొంపముంచినట్లయింది. ఈ పరిణామంతో చాలామంది టికెట్ దొరకలేని ఆశావాదులు ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. కేసీఆర్ పార్టీ నుండి జూపల్లి ఇంకా పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకోవడం తెలిసిందే. అదే రీతిలో మరి కొంతమంది హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. మరోపక్క తెలంగాణ బీజేపీ నేతలు.. తమ పార్టీలోకి ఇతర నాయకులను తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ జోరు అందుకుంది. ఈ రెండు మూడు వారాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన.. కీలక నాయకులు హస్తం గూటికి చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు టాక్.

former brs mlc join congress in another big blow to kcr

KCR : కేసీఆర్ కి మరో భారీ దెబ్బ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ..!!

అసెంబ్లీ ఎన్నికల ముందే కేసీఆర్ పార్టీకి ఫారుక్ హుస్సేన్ గుడ్ బై చెప్పబోతున్నారట. ఇటీవల ఆయన వాట్సాప్ గ్రూపులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులతో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడం జరిగిందట. దీంతో ఫారుక్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం కన్ఫామ్ అనే ప్రచారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా జరుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది