KCR : హాస్పటల్ లో చేరిన కేసీఆర్..ఆందోళనలో పార్టీ శ్రేణులు
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former Telangana CM KCR ) గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో (AIG Hospital) చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పలు ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ హాస్పిటల్‌కి వెళ్లినట్టు సమాచారం. సాధారణంగా ఆయన ఆరోగ్యపరమైన సేవల కోసం యశోదా హాస్పిటల్‌ను ఆశ్రయించేవారు. గతంలో జరిగిన తుంటి ఆపరేషన్ కూడా అదే హాస్పిటల్‌లో జరిగింది. అయితే ఈసారి ఏఐజీకి వెళ్లడంతో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చాకే ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది.
ఇక ఇదిలా ఉండగా ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై (BRS founding meeting) కేసీఆర్ (KCR ) చాలా కీలకంగా దృష్టి పెట్టారు. సభను విజయవంతం చేయడం కోసం రోజువారీగా జిల్లా నాయకులను ఫాంహౌజ్‌కు పిలిపించుకుని పలు సూచనలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది కార్యకర్తలు రావాలో, ఎన్ని వాహనాలు ఏర్పాటు చేయాలో కూడా స్వయంగా కేసీఆర్ చెబుతున్నారు. ఈ సభే పార్టీకి ప్రాణంగా మారిన సమయంలో ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం విశేషంగా మారింది.

KCR : హాస్పటల్ లో చేరిన కేసీఆర్..ఆందోళనలో పార్టీ శ్రేణులు
రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వేళ, బీఆర్ఎస్ తన ప్రస్థితిని మళ్లీ స్థిరపర్చుకోవాలంటే వరంగల్ సభ కీలకమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే కారణంగా ఆయన ఆరోగ్యాన్ని ముందుగానే పరీక్షించుకుంటున్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిడులు, వేడి వాతావరణం మధ్యలోనూ కేసీఆర్ ఉత్సాహంగా సభ ఏర్పాట్లపై దృష్టి పెట్టడం గులాబీ శ్రేణులకు ధైర్యాన్ని కలిగించినా, ఆరోగ్య విషయమై ఆయన్ని ఆసుపత్రిలో చేరడం ఓ విధంగా ఆందోళనకు కారణమవుతోంది.